Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి, వసు కోసం కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర దంపతులు కాలేజీకి వస్తారు. ఇంతలోనే రిషి బయటికి రావడంతో మహేంద్ర ఏం జరిగింది రిషి వసుకి ఏమయ్యింది అని టెన్షన్ గా అడుగుతూ ఉంటాడు. కాలేజ్ మొత్తం వెతికాను డాడీ ఎక్కడ కనిపించలేదు అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్, వసుధార ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుంది ఎవరు భయపడద్దండి అని ధైర్యం చెబుతాడు.
అప్పుడు రిషి మాత్రం క్షేమం గురించి కాదురారేపు తన ఎగ్జామ్ రాకపోతే తన లైఫ్ వేస్ట్ అవుతుంది అని రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇప్పటికే చాలా టైం అయిపోయింది రేపొద్దున్నే వెతుకుదాము అని గౌతమ్ మహేంద్ర వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోగా రిషి మాత్రం కాలేజీ గెస్ట్ హౌస్ లో పడుకుంటాను అని చెప్పి అక్కడే పడుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం రిషి నిద్రలేచి చూసేసరికి సమయం దాటిపోయి ఉండడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఇంతలోనే జగతి దంపతులు రావడంతో రిషి జగతిని వాళ్ళ ఫ్రెండ్స్ ని అడగండి మేడం ఏదో ఒకటి చేయండి మేడం అని టెన్షన్ పడుతూ అడుగుతాడు. పుష్ప అక్కడికి రావడంతో వసు గురించి తెలిసిందా అని అడుగగా తెలియదు అని చెప్పడంతో మరింత టెన్షన్ పడతారు. ఆ తర్వాత మహేంద్ర జగతి వాళ్ళు పరీక్షకు టైం అవుతుంది అని ఆ ఏర్పాట్లు చూడడానికి వెళ్తారు. కానీ రిషి మాత్రం ఎక్కడికి వెళ్లి పోయావు వసు నువ్వు లేకపోతే నేను ఏం కావాలి అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
వసుధార గురించి ఆలోచిస్తూ లోపలికి వెళుతూ ఉండగా అక్కడ వసుధర దాచుకున్న గోళీలు కనిపిస్తాయి. అవి అక్కడ ఎందుకు ఉన్నాయి అన్న అనుమానంతో లోపలికి వెతుక్కుంటూ వెళ్ళగా అక్కడ వసుధర స్పృహ లేకుండా పడిపొడి ఉండడం చూసి రిషి టెన్షన్ పడతాడు. ఇంతలా గౌతం రావడంతో గౌతమ్ ని డాక్టర్ ని పిలుచుకొని చెప్పి అక్కడ నుంచి పంపిస్తాడు.
తర్వాత రిషి వసుధారని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్లి సోఫాలో పడుకోబెట్టి వసుదలను నిద్ర లేపడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. మరొకవైపు ఎగ్జామ్ హాల్లో జగతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు రిషి ఏ పొగరులే నేను నీ రిషి వచ్చాను అంటూ గట్టిగా అరుస్తాడు.లెయ్ పంతులమ్మ అంటూ ఎమోషనల్ అవుతాడు రిషి. మరోవైపు జగతి టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే వసు మేడం క్వశ్చన్ పేపర్ అనడంతో జగతి సంతోష పడుతూ ఉంటుంది.
ఎక్కడికి వెళ్లావు ఏమైంది సరే ఫస్ట్ మొదటి ఎగ్జామ్ రాయి అనడంతో వసుధర ఎగ్జామ్ రాయడానికి శతవిదాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నేను ఎలా అయినా ఎగ్జామ్ రాయాలి అని ధైర్యంగా ఎగ్జామ్ రాస్తుంది. అప్పుడు వసుధర కండిషన్ చూసిన జగతి ఎమోషనల్ అవుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World