Guppedantha Manasu 1 Sep Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ బాగా రాయాలి అని టిప్స్ చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి తో పాటు అక్కడున్న స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఎగ్జామ్స్ ఎలా రాశారు. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి ఈ ఎగ్జామ్స్ మీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయి స్టూడెంట్స్ కి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వసు ఫ్రెండ్ పుష్ప ఈ ఎగ్జామ్స్ అయిపోతే మనం రిషి తిట్లనే మిస్ అవుతాం కదా అని అనగా నేను రిషి సార్ ని మిస్ అవుతాను అని మనసులో అనుకుంటుంది వసు.
మరొకవైపు దేవయాని సాక్షితో మాట్లాడుతూ.. ఆ వసుధారని ఇంట్లో అందరూ దేవతలా చూస్తున్నారు. ఎగ్జామ్స్ లో కనుక వసుధార గెలిస్తే రేపు ఏకంగా పెళ్లి అంటారు. కాబట్టి ఈ పరీక్షలు వసు రాయకుండా ఏదో ఒకటి చేయాలి సాక్షి అని అంటుంది దేవయాని. అందుకు సాక్షి సరే అని అంటుంది. ఆ తర్వాత లైబ్రరీకి వెళ్లి వస్తుండగా ఇంతలో ఒక ఆమె వసుధార వైపు వచ్చి కోపంగా చూస్తుంది ఆ తర్వాత వస్తారా లైబ్రరీ కి వెళ్తుండగా మధ్యలో జగతి మహేంద్ర మాతోపాటు రా వసు ఇంటి దగ్గర దింపుతాము అనడంతో లేదు సార్ లైబ్రరీలో పని ఉంది అని చెప్పి వాళ్ళను వెళ్ళమంటుంది.
Guppedantha Manasu 1 Sep Today Episode : వసుని చూసి ఎమోషనల్ అయిన రిషి..
ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. విద్యార్థులందరూ ఎగ్జామ్స్ ఎలా రాశారు అని అడగగా జగతి బాగానే రాసారు అంట సర్ అని అంటుంది. అప్పుడు వసూల్ కూడా నేను కూడా బాగానే రాశాను సార్ అని అంటుంది. ఆ తర్వాత రిషి తన క్యాబిన్ లోకి వెళ్లి ఎగ్జామ్స్ ఎలా రాశావు అని మెసేజ్ చేస్తాడు. మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అని వసు కి మెసేజ్ చేయగా నాకు ఇష్టమైన వాళ్లతో లాంగ్ డ్రైవ్ వెళ్తాను సార్ అని అంటుంది వసు.
అలా వారిద్దరూ సరదాగా చాటింగ్ చేసుకున్న తర్వాత ఇంతలో ఒక ఆమె వచ్చి వసుధారకు మత్తుమందు ఇచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత తన ల్యాబ్ లో పడుకోబెడుతుంది. ఆ తర్వాత రిషి వసుధార గురించి ఆలోచిస్తూ తనకు మెసేజ్ చేయగా ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్కడికి గౌతమ్ రావడంతో గౌతమ్ కి అసలు విషయం చెప్పగా ఇద్దరు టెన్షన్ పడుతూ వసు ను వెతకడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు.
ఇక్కడ ఇంటికి తాళం వేసి ఉండేసరికి వెంటనే జగతికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో జగతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే దేవయానికి మన ప్లాన్ సక్సెస్ అని సాక్షి మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత రిషి, గౌతమ్,జగతి దంపతులు అందరూ కలిసి కాలేజీలో వసు కోసం వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. రిషి మాత్రం వసు కు ఏమయిందో అని లో లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో వసుధర ల్యాబ్ లో కింద పడిపోయి కనిపించేసరికి రిషి చాలా టెన్షన్ పడతాడు. ఆ తర్వాత వస్తారని ఒక సోఫాలో కూర్చోబెట్టి ఏ పొగరు పైకి లే నీకు ఏమయ్యింది. పంతులమ్మ ను అవుతాను అన్నావు కదా పంతులమ్మ లెయ్ అంటూ ఎమోషనల్ అవుతాడు రిషి. నేను నీ రిషి వచ్చాను చెబుతున్నాను పైకి లెయ్యి అని రిషి ఎంత అరిచినా కూడా వసు ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World