Guppedantha Manasu Aug 19 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి అన్న మాటలకు జగతి సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతినీ రిషి ఇప్పటినుంచి నన్ను రిషి సార్ అని కాకుండా రిషి అని పిలవండి అనడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు జగతితో మీరు నా విషయంలో చాలా హెల్ప్ చేశారు అందుకే థాంక్స్ చెప్పాను అని చెప్పి ఎక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడు అక్కడికి మహేంద్ర రావడంతో మహేంద్ర తో చెప్పుకుని ఇంకా సంతోషపడుతుంది జగతి.
![Guppedantha Manasu Aug 19 Today Episode : రిషికి రింగు చేయించాలి అనుకున్న వసు..ఒకే కారులో జగతి దంపతులు వసు,రిషి..? Rishi gets suspicious of Vasudhara's behaviour in class in todays guppedantha manasu serial episode](https://tufan9.com/wp-content/uploads/2022/08/Rishi-gets-suspicious-of-Vasudharas-behaviour-in-class-in-todays-guppedantha-manasu-serial-episode.jpg)
మరొకవైపు వసుధార ఎంగేజ్మెంట్ చూస్తూ రిషి సార్ ఈ రింగు కావాలని తీసుకు వచ్చాడా లేదంటే అనుకోకుండా తీసుకోవచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన బుక్కులో వి ఆర్ అని రాసుకుంటూ తాను ఆర్ అనే అక్షరంతో రింగు చేయించాలి అని అనుకుంటుంది. మరొకవైపు జగతి దంపతులు కాలేజీకి వెళ్తూ ఉండగా మహేంద్ర సంతోషంతో సరదాగా జోకులు వేస్తూ ఉంటాడు.
అప్పుడు కారు పంచర్ అవ్వగా ఇంతలోనే అక్కడికి వచ్చిన రిషి నేను లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మహేంద్ర జగతిని ముందర సీట్ లో కూర్చోబెట్టి తాను వెనుక సీట్లో కూర్చుంటాడు. అప్పుడు జగతి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు వసు కాలేజీకి అని బయటిదేరగా ఆటోలు వెళ్తే డబ్బులు ఖర్చవుతాయి డబ్బులు మిగిల్తే సార్ కి రింగ్ చేయించాలి అనుకుంటుంది.
Guppedantha Manasu Aug 19 Today Episode : ఒకే కారులో జగతి దంపతులు వసు,రిషి..
అప్పుడు వసుధార నడుచుకుంటూ వెళ్తూ ఉండగా జగతి వసు నీ చూసి కారు ఆపుతుంది. అప్పుడు వస వెళ్లి రిషి పక్కన కూర్చుంటుంది. అప్పుడు మహేంద్ర కారు నడుపుతాను అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తెగ సంతోష పడుతూ హంగామా చేస్తూ ఉంటాడు. అప్పుడు కావాలనే పదేపదే బ్రేకులు వేస్తూ రిషి వసు ఒకరికి ఒకరు టచ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాడు.
ఆ తర్వాత కాలేజీకి వెళ్లిన వసుధార క్లాసు రూమ్ లో కూర్చుని రింగుకు ఎంత ఖర్చవుతుంది అని లెక్క వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి క్లాస్ కి వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉంటుంది. అప్పుడు రిషి బోర్డుపై ఒక ప్రాబ్లం వేసి దాన్ని వసు నీ సాల్వ్ చేయమని చెబుతాడు.