Commitment Movie Review : ప్రస్తుతం కమిట్‌మెంట్ అనే పదాన్ని చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్య.. కొంతమంది మహిళలు ధైర్యంగా తమకు ఎదురైన అనుభవాలను వెలుగులోకి తీసుకొస్తే.. మరికొందరు ఆ సమస్యను ఒంటరిగానే ఎదుర్కొంటున్న పరిస్థితి.. అందులో నుంచి ఉద్భవించిదే.. మీటూ ఉద్యమం (Meto Movement). ఇదే పాయింట్ తీసుకుని కమిట్ మెంట్ (Commitment Review) మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా..
ఇదివరకే ‘హైదరాబాద్ నవాబ్స్’ మూవీతో పాపులర్ అయిన ఈ డైరెక్టర్ 2008లో ‘నిన్న నేడు రేపు’ మూవీతో దర్శకుడిగా సక్సస్ అయ్యారు. ఆ తర్వాత మరో ప్రాజెక్టు చేయలేదు. ఇప్పుడు అదే డైరెక్టర్ ‘Commitment Movie’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లక్ష్మీకాంత్ చెన్నా.. ఈ కమిట్‌మెంట్ (Commitment Movie Release) మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందో లేదో ఓసారి రివ్యూలోకి లుక్కేయండి.
స్టోరీ లైన్ ఇదే (Movie Story) :
కమిట్‌మెంట్.. లైంగిక వేధింపులను ఎదుర్కొనేవారి నుంచి ఎక్కువగా వినిపించే పదం.. అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ ఏదో సాధించేందుకు ప్రయత్నించే ఐదుగురు అమ్మాయిల లైఫ్ స్టోరీ ఇది.. తమ జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు పోరాడే ఐదుగురు అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అనేది స్టోరీ లైన్.. ఇందులో (ఒక సెక్సాలజిస్ట్, యుక్త వయస్కురాలు, విద్యార్థి, జూనియర్ డాక్టర్, సినిమా హీరోయిన్) ఈ ఐదుగురు తమ జీవితంలో ఒకే మాదరి సమస్యను ఎదుర్కొంటారు. కొందరు వ్యక్తులు వీరిపై లైంగిక వేధింపులకు గురిచేస్తారు. కమిట్మెంట్ ఇవ్వాలని బలవంతం చేస్తుంటారు. ఇలాంటి సమస్యను ఈ ఐదుగురు అమ్మాయిలు ఎలా ఎదుర్కొగలిగారు అనేది అసలు స్టోరీ..
నటీనటులు ఎవరంటే (Movie Cast) :
అన్వేషి జైన్, తేజస్వి మదివాడ, రమ్య పసుపులేటి, శ్రీనాథ్ మాగంటి, రాజా రవీంద్ర, అమిత్ తివారీ, సిమర్ సింగ్, తనిష్క్ రాజన్, సూర్య శ్రీనివాస్ నటించారు. ఇక లక్ష్మీకాంత్ చెన్నా ఈ మూవీకి దర్శకుడిగా తెరకెక్కించారు. బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి మూవీని నిర్మించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరించగా, మ్యూజిక్ నరేష్ కుమారన్ అందించాడు. అలాగే సినిమాటోగ్రఫీని సజీష్ రాజేంద్రన్, నరేష్ రానా అందించారు.
Movie Name : | Commitment (2022) |
Director : | లక్ష్మీకాంత్ చెన్నా |
Cast : | తేజస్వి మదివాడ, శ్రీనాథ్ మాగంటి, రమ్య పసుపులేటి, అన్వేషి జైన్, అమిత్ తివారీ, సూర్య శ్రీనివాస్, సిమర్ సింగ్, రాజా రవీంద్ర, తనిష్క్ రాజన్ |
Producers : | నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్ |
Music : | నరేష్ కుమారన్ |
Release Date : | 19, ఆగస్టు 2022 |
Commitment Movie Review : ఇంతకీ మూవీ ఎలా ఉందంటే? :
లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలంతా చేపట్టిన ఉద్యమమే ఈ మీటూ (me too) ఉద్యమం.. మీటూ ఉద్యమంపైనే సినిమా మొత్తం ఉంటుంది. చాలావరకూ సన్నివేశాల్లో ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కానీ, మూవీలో స్టోరీ లైన్ బలంగా లేకపోవడం కూడా మైనస్ పాయింట్ గా చెప్పాలి. అసలు పాయింట్ మిస్ అయిందనే ఫీలింగ్ అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. వెండితెరపై పెద్దగా ఆడియోన్స్ ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. మూవీ విషయంలో టేకింగ్ మరింత బలంగా ఉంటే బాగుండు అనిపించింది.
ఆ ఐదుగురు అమ్మాయిల్లో తేజస్వి మదివాడ తనదైన నటనతో ఆకట్టుకుంది. రమ్య పసుపులేటి పర్వాలేదనిపించింది. ఇతర నటులు తమ పాత్రలలో మెప్పించారు. అయితే ఈ మూవీలో స్కిన్‌షో అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా అనిపించింది. అతి ఎక్కువగా అయిందనే భావన ప్రేక్షకుల్లో కలగొచ్చు. ఏదిఏమైనా మూవీలో ఇతర నటుల్లో అమిత్ తివారీ, రాజా రవీంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్ పరంగా చూస్తే.. మూవీ అంతగా ఆకట్టుకునేలా లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కానీ, పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. నరేష్ రానా, సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ పెద్దగా లేదు. మూవీ నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. ఈ మూవీని ఆడియెన్స్ తో ఎంగేజ్ చేయడంలో దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా అనుకున్నంత స్థాయిలో అందించలేకపోయాడని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కమిట్‌మెంట్ మూవీని మాస్ ఆడియోన్స్, అడల్ట్ సన్నివేశాలపై ఆసక్తి ఉన్నవారూ థియేటర్‌కు వెళ్లి సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు..
[Tufan9 Telugu News]
కమిట్‌మెంట్ మూవీ
రివ్యూ & రేటింగ్ : 2.9/5
Read Also : Wanted PanduGod Movie Review : ‘వాంటెడ్ పండుగాడ్‘ మూవీ రివ్యూ.. టీవీ స్కిట్‌లకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world