Guppedantha Manasu : తెలుగు బుల్లీతెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఒక అతను రిషి దగ్గరికి వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి పెన్ డ్రైవ్ తీసుకుని అందులో ఏముందో అని చూడగా అక్కడ ఒక ఆమె వస్తారని కిడ్నాప్ చేయడం చూసి చివర్లో సాక్షి కనిపించడంతో ఇదంతా సాక్షి చేసిందా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు రిషి. మరి ఇంత పెద్ద విషయం నా దగ్గర వసుధార ఎందుకు దాచిందో అడగాలి అని కోపంగా అక్కడికి బయలుదేరుతాడు.
Rishi gets furious after learning about Sakshi’s evil deed in todays guppedantha manasu erial episode
మరొకవైపు వసుధార, ధరణి ఎదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధార తన వల్ల అదంతా జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక చోట దేవయాని,మహేంద్ర,జగతి ముగ్గురు కూర్చుని మాట్లాడుతూ ఉండగా అప్పుడు దేవయాని వసు నీ పరాయి వాళ్ళు అంటూ అవమానించే విధంగా మాట్లాడుతూ ఎలా అయినా వసుధారని ఇంట్లో నుంచి పంపించాలి అని అంటుంది.
మరొకవైపు రిషి,వసు కోసం రెస్టారెంట్ కి తన ఇంటికి వెళ్ళగా అక్కడ కనిపించకపోవడంతో ఫోన్ చేయగా మీ ఇంట్లో ఉన్నాను సార్ అని చెప్పడంతో కోపంగా ఇంటికి బయలుదేరుతాడు. ఆ తర్వాత జగతి కాలేజీకి సంబంధించిన పని చేస్తూ ఉండగా అప్పుడు మహేంద్ర ఇన్ని సమస్యల్లో కూడా నువ్వు పని చేస్తున్నావు చాలా గ్రేట్ అంటూ పొగుడుతూ ఉంటాడు.
ఆ తర్వాత వారిద్దరూ కలిసి రిషి వసు ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయాని హాల్లో కూర్చుని ఎలా అయినా వసదారనీ పంపించేయాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసుధార గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని.
Guppedantha Manasu : మళ్లీ దగ్గరవుతున్న రిషిధార..
ఆ తర్వాత రిషి ఎక్కడి నుంచి వెళ్లిపోవడంతో వసుధార కూడా వెంటనే వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి వదిన ఎలా ఉంది అని అడగగా బాగానే ఉంది అని అనటంతో సరే రెస్ట్ తీసుకోండి వదిన అని అంటాడు. ఆ తర్వాత రిషి ఒంటరిగా కూర్చుని ఉండగా వసుధర కాఫీ తీసుకొని వెళుతుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు అని రిషి అనడంతో వసుదారా జగతి విషయం గురించి అని అనుకుంటుంది. ఆ తరువాత వసు, తెచ్చిన కాఫీని రిషి తాగి థ్యాంక్స్ అని చెబుతాడు. ఆ తర్వాత దేవయాని ఒంటరిగా ఆలోచిస్తూ వసు నీ ఎలా అయినా పంపించాలి అనుకుంటూ ఉండగా కోపంతో అక్కడికి రిషి వస్తాడు.
రిషి కోపంగా ఉండటం చూసిన దేవయాని ఏదో జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు పెద్దమ్మ ఆ సాక్షి పేరు వింటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అనడంతో దేవయాని షాక్ అవుతుంది.
Read Also : Guppedantha Manasu: వసు మాటలకు ఆలోచనలు పడ్డ దేవయాని..వసుకి ప్రేమ పరీక్ష పెట్టిన రిషి..?