Guppedantha Manasu: రిషి మాటలకు షాక్ అయిన దేవయాని.. దగ్గరవుతున్న వసు, రిషి..?

Rishi makes fun of Vasudhara after overhearing her words in todays kartika deepam serial episode
Rishi makes fun of Vasudhara after overhearing her words in todays kartika deepam serial episode

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, దేవయాని దగ్గరికి వెళ్తాడు.

ఈరోజు ఎపిసోడ్లో రిషి కోపంగా ఉండడంతో దేవయానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి కోపంగా మాట్లాడుతూ ఉండడంతో దేవయాని ఆ వసుధార గురించి అనుకోని రిషి ని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి కోపంగా మాట్లాడుతూ ఉండగా దేవయాని సంతోష పడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు రిషి కోపంతో మాట్లాడుతూ ఆ సాక్షి పేరు తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అనటంతో దేవయాని షాక్ అవుతుంది. ఇంతవరకు నువ్వు కోపంగా మాట్లాడింది సాక్షి గురించి నా అని అనగా అవును ఆ సాక్షి గురించి పెద్దమ్మ అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ఇప్పుడు రిషి ఆ సాక్షి చేసిన విషయాలు అని చెప్పగా దేవయాని అని తన పేరు ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు వసుధర వంట చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. అప్పుడు జరిగిన విషయాల గురించి జగతి, వసుధారతో బాధపడుతూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసుదార మాత్రం ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ జగతి ఎమోషనల్ గా మాట్లాడగా వసు మాత్రం ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది.

అప్పుడు జగతి నన్ను రిషి అమ్మ అని పిలవకపోయినా పర్లేదు కానీ మీ మధ్య ఎటువంటి గొడవలు రాకూడదు అని అంటుంది. ఆ తర్వాత జగతి వంట చేస్తూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడికి రిషి వచ్చాడు అని తెలిసి కాపీ ఇవ్వాలని అనగా అప్పుడు వెంటనే రిషి కాఫీ చేసుకుంటూ వసుధార విషయం గురించి జగతితో మాట్లాడుతూ, మీరైనా తనకి సర్ది చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

మరొకవైపు రిషి, కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు రిషి వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో అక్కడినుంచి గౌతమ్ వెళ్లిపోగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు రిషి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయం జరగదు అని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ మహేంద్ర కి స్వారీ చెబుతాడు. అప్పుడు మహేంద్ర తో కాస్త క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు రిషి.

ఆ విషయంలో నన్ను ప్రెసర్ చేయకండి నేను విజయేంద్ర భూషణ్ గానే ఉంటాను అనటంతో మహేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధార, జగతి ఇద్దరూ వంట చేస్తూ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు కావాలనే జగతి ఎక్కడి నుంచి వెళ్లిపోవడంతో రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు జగతి వచ్చింది అనుకొని వసుధర ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు రిషి టమోటాలు కట్ చేస్తూ ఉండగా రిషి సార్ కూడా మీలాగే కానీ కొంచెం కోపం ఎక్కువ అని అంటుంది వసు. అక్కడ జగతి ఉంది అనుకొని రిషికి పదే పదే పనులు చెబుతూ ఉంటుంది. అప్పుడు రిషి ని చూసి వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇద్దరూ వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా వసుధార రిషి మీద జ్యూస్ ఒలక పోసి తుడుస్తూ ఉండగా అది చూసిన దేవయాని అక్కడికి వస్తుంది.

Advertisement