Guppedantha Manasu june 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు దేవయాని సాక్షి గురించి మాట్లాడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని సాక్షి గురించి మాట్లాడటంతో రిషి అన్నం తినకుండా మధ్యలో వదిలేసి ఇంకొకసారి ఈ ఇంట్లో సాక్షి పేరు వినిపించ కూడదు అని దేవయాని కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మహేంద్ర కూడా భోజనం తినకుండా మధ్యలో వదిలేస్తాడు. అప్పుడు మహేంద్ర,జగతి ఇద్దరూ కలిసి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము వాటిని అడ్డుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
మరొకవైపు వసు, రిషి తో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అని మెసేజ్ చేయగా ఆ మెసేజ్ చూసిన రిషి, వసు గురించి ఆలోచిస్తూ తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తరువాత వసుధార లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాను కానీ మీరు మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదు అని మెసేజ్ చేస్తుంది. అలా వారిద్దరూ కాసేపు చాట్ చేసుకుంటారు.
ఇక మరుసటి రోజు ఉదయం రిషి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో వసు అక్కడికి వచ్చి రిషి పై అరుస్తూ తనతో ఇదివరకులా ఉండడం లేదు సరిగ్గా మాట్లాడటం లేదు అని అనగా అప్పుడు రిషి నాకు వర్క్ ఉంది అని చెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు మహేంద్రా దంపతులు కాలేజీకి వస్తారు.
కాలేజీకి వచ్చి రాగానే మహేంద్ర రిషిధారఎక్కడ ఉంది అని అనగా ఆ మాట విన్న రిషి ఏంటి డాడీ అని అడుగగా అప్పుడు మహేంద్ర దానిని కవర్ చేసుకుంటాడు. అప్పుడు రిషి, వసు గురించి మాట్లాడుతూ జగతి మేడం మీ స్టూడెంట్ జీవిత లక్ష్యం మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదు ఒకసారి చెప్పండి అని అంటాడు.
ఆ తరువాత జగతి మహేంద్ర లు వసు, రిషి ల గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు వస్తుంది. అప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి జగతిని అడగగా ఆ విషయం డైరెక్ట్ గా రిషితో మాట్లాడమని జగతి,వసు కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ తరువాత వసుధార రిషి దగ్గరికి వెళ్లి ఆఫీస్ బాయ్ బదులుగా తాను టీ ఇవ్వడంతో అప్పుడు రిషి, వసు పై మండి పడతాడు. అప్పుడు వసుధార అక్కడినుంచి బాధతో వెళ్ళిపోతుంది. మరొక వైపు ఇల్లు మొత్తం సైలెంట్ గా ఉండడంతో దేవయాని ఏదో జరగబోతోంది ఎలా అయినా రిషి, సాక్షి కి పెళ్లి చేసి నా బాధ్యతను నిర్వహించాలి అని అంటుంది. ఆ తరువాత రేపటి ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరూ బయటికి వెళ్లి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu june 24 Today Episode : సరదాగా గడిపిన వసు, రిషి.. రిషి మనసును బాధ పెట్టిన దేవయాని..?