Guppedantha manasu june 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని ఎలా అయినా సాక్షి, రిషీకి పెళ్లి చేసి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు తనపై రిషీ కోప్పడడంతో అక్కడి నుంచి ఆలోచిస్తు వెళుతూ ఉండగా ఇంతలో జగతి ఎదురుపడుతుంది. అప్పుడు వెళ్లిన పని ఏమైంది అని జగతి అవుతూ ఉండగా అప్పుడు వసు జరిగిన విషయాన్ని వివరించ బోతుండగా అ ఇంతలో అక్కడికి వస్తాడు.
అప్పుడు రిషీ మేడం మినిస్టర్ గారు మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫైల్ ని తీసుకుని రమ్మన్నారు మీరు మీ స్టూడెంట్ వెళ్ళండి అని చెప్పడంతో, అప్పుడు నాకంటే మీరు వెళ్లడమే కరెక్ట్ అని అంటుంది. అప్పుడు వెంటనే రిషి మీ స్టూడెంట్ ని రెడీ గా ఉండమని చెప్పండి నేను బయట కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను రమ్మని చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు జగతి వసుధార కి ధైర్యం చెప్పి పంపిస్తుంది. జగతి ఏదో పని చేసుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు జగతి అని అడగగా ఇప్పుడే కదా అక్క ఇంటి నుంచి వచ్చాను ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది జగతి. మహేంద్ర ఉన్నాడా అని అడిగి లేడు అని అనడంతో వసుధార గురించి రిషీ గురించి మాట్లాడుతుంది దేవయాని.
అప్పుడు జగతి ఏమాత్రం తగ్గకుండా దేవయానికి తగ్గట్టుగా సమాధానం చెబుతుంది. మరొకవైపు వసుధార, రిషీ ఇద్దరు కార్లో వెళ్తూ ఉండగా రిషి తనకు షీట్ బెల్టు పెట్టినట్లు వసుధార ఊహించుకుంటూ ఉంది. కానీ అదంతా తన భ్రమ అని అనుకుంటుంది. ఆ తర్వాత రిషి మౌనంగా ఉండడం తో వసుధార ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండగా అప్పుడు విషయం మాత్రం వసు పై కోప్పడతాడు.
ఆ తర్వాత వారిద్దరూ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లగా అక్కడ వసుధార మినిస్టర్ గారికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరించడం తో మినిస్టర్, రిషి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వసు, రిషి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మినిస్టర్ జగతి కి ఫోన్ చేసి అటువంటి కొడుకుని కన్నందుకు మీరు చాలా గ్రేట్ మేడం ఉంటూ జగతిని పొగడుతాడు.
ఒకవైపు రిషి, వసు ఇద్దరూ కారులో వెళ్తూ ఉండగా అప్పుడు వసుధార మాట్లాడే మాటలకు వెటకారంగా సమాధానం చెబుతాడు రిషి. ఆ తర్వాత రోడ్డు మీద ఇద్దరు కలిసి పుచ్చకాయ తింటూ ఉంటారు. అప్పుడు పుచ్చకాయ రిషి మూతికి అంటుకోగా వసు మొబైల్ లో ఫోటో తీసి రిసిపి చూపిస్తుంది. అలా వారిద్దరూ కాసేపు పనిగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Read Also : Guppedantha Manasu june 25 Today Episode : వసుధార పై కోప్పడిన రిషి.. మళ్లీ ఏదో ప్లాన్ వేసిన దేవయాని..?