Guppedantha Manasu january 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో వసుధార మినిస్టర్ తో మాట్లాడుతూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరించడంతో మినిస్టర్ సూపర్ ప్లాన్ అంటూ వసుధారని పొగుడుతూ ఉంటాడు. ఇంక నాకు నువ్వేమీ చెప్పకమ్మా రిషి వసుధార చాలా తెలివైన అమ్మాయి ఇలాంటి అమ్మాయిని వదులుకోకూడదు అనడంతో తనే నన్ను వదులుకుంది సార్ అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు మినిస్టర్ వసుధార నువ్వు రిషి ఇద్దరు కలిస్తే ఎన్నో అద్భుతాలు చేస్తారు. మీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించండి అనడంతో రిషి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు.

Guppedantha Manasu january 27 Today Episode
ఆ తర్వాత వాళ్ళు కారులో వెళ్తే ఉండగా ఇంతలోనే కాలేజీ ఫ్యాకల్టీ సార్ మీ మీద మినిస్టర్ గారు చాలా గౌరవం పెట్టుకున్నారు కదా అనగా ఎవరి గౌరవం అభిమానానికి లొంగిపోకూడదు మేడం కొంతమంది కొన్ని కొన్ని సార్లు తొందరగా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు అని వసుధారని ఉద్దేశించి మాట్లాడతాడు. వసు పై కూడా మినిస్టర్ గారు నమ్మకం పెట్టుకున్నారు కదా సార్ అనడంతో వసుధర గారు చాలా తెలివైన వారు అందరిని తన మాటలతో కన్విన్స్ చేస్తారు అని అంటాడు రిషి. తర్వాత కాలేజీ ఫ్యాకల్టీ వాళ్ళ అబ్బాయి స్కూల్ నుంచి ఫోన్ రావడంతో తీసి ఆ మేడంని వాళ్ళ ఇంటిదగ్గర దిగబట్టడానికి వెళ్తాడు.
అప్పుడు వసుధార,రిషి సార్ తో మాట్లాడడానికి ఇదే సరైన సమయం అని కారు దిగుతుండగా ఇంతలోనే రాజీవ్ ఎదురుగా వచ్చి కారు అడ్డు పెడతాడు. అప్పుడు రిషి కారు దిగుతుండగా సార్ వెళ్ళొదు సార్ మీరు మనం వెళ్ళిపోదాం అనడంతో అతను వస్తున్నాడు ఎలా వెళ్తాం అనడంతో నాకు అతని కంటే మీరే ఇంపార్టెంట్ సార్ అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఇంతలోనే రాజీవ్ అక్కడికి వచ్చి నమస్తే రిషి సార్ కారు దిగండి రెండు నిమిషాలు మాట్లాడాలి అనడంతో వద్దు సార్ మీరు ముందు కారు ఫోన్ ఇవ్వండి అంటుంది వసుధార.
అప్పుడు రిషి కారు దిగడంతో మీరు చాలా మంచి వారు రిషి సార్ అయినా మీకు నా మీద కోపం ఉండవచ్చు అని నందు నాకు ఎవరి మీద కోపం లేదు అంటారు. అప్పుడు వసుధర వెళ్దాం పద అనడంతో నేను రాను నువ్వు వెళ్ళు అని అంటుంది. అదేంటి వసు అలా మాట్లాడతావో చూసారా రిషి సార్ ఇప్పుడు కూడా మీరే కావాలి అంటోంది అనడంతో నేను నీతో పాటు రాను రిషి సార్ తో వెళ్తాను అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. నా భార్యని నాతోపాటు పంపించండి సార్ అనడంతో మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో రోడ్డు మీద ఈ న్యూసెన్స్ ఏంటి అంటుంది.
అప్పుడు రా వాసు వెళ్దాం అని వసుధర చేయి పట్టుకోవడంతో అది చూసి రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంతలో ఆటో అక్కడికి రావడంతో వసుధార చెయ్యి విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రిషి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాజీవ్ నవ్వుకుంటూ వీరిద్దరి మధ్య దూరం పెంచడానికి శంకుస్థాపన చేశాను అనుకుంటూ ఉంటాడు. మరో వైపు దేవయాని నా కళ్ళ ముందు ఇంత జరుగుతున్న ఏం చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాజీవ్ ఫోన్ చేసి మేడం జీ మీకు ఒక గుడ్ న్యూస్.
రిషి,వసు మధ్య దూరం పెంచడానికి శంకుస్థాపన చేశాను త్వరలోనే వారిద్దరిని పూర్తిగా విడగొట్టేస్తాను అనడంతో దేవయాని మనకు అదే కదా కావాల్సింది అని సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర రిషి ఇద్దరు ఒకచోట కలుసుకోగా అప్పుడు రిషి బాధ నుంచి బయటపడడానికి మందు తాగాలి అనుకుంటాడు. అప్పుడు మహేంద్ర ఎంత చెప్పిన వినిపించుకోకుండా మీరు మందు పోయండి డాడ్ అని అనడంతో మహేంద్ర మందు పోసి రిషికి ఇస్తాడు. మరొకవైపు వసుధార ప్రేమతో తన తండ్రికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత రిషి చేతిలోకి మందు గ్లాస్ తీసుకొని తాగాలి అని చూసి ఆ గ్లాస్ ని విసిరి కొట్టడంతో మహేంద్ర కూడా తన చేతిలో ఉన్న గ్లాసును విసిరి కొట్టి మందు బాటిల్స్ అన్ని విసిరేసి నాకు తెలుసు నాన్న నువ్వు ఇలాంటి వాటికి లొంగవు అనే పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార తలుచుకుని బాధపడుతూ ఉంటారు రిషి. అది చూసి మహేంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార చక్రపాణి ఇద్దరు రిషి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
Read Also : Guppedantha Manasu january 26 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార.?