RGV Tweet : మైసమ్మకు విస్కీ పోసిన వర్మ.. ఫొటోలు వైరల్.. నెటిజన్ల ఆగ్రహం!

RGV Maisamma drink Whisky : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సంచలన దర్శకుడు, రాంగోపాల్ వర్మ.. ఆయన ఏది చేసినా వివాదానికి దారితీయాల్సిందే.. ఆయన వ్యవహారశైలితో ఎప్పుడలా ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టమే. వర్మ ఏది చేసిన సంచలనమే.. ఇప్పుడు అదే ప్రయత్నంలో వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

ప్రమోషన్ స్టంట్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు ఏకంగా అమ్మవారికే విస్కీని సాకగా పోస్తున్న ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. తాను మాత్రం వోడ్కో తాగితే.. మైసమ్మ విస్కీ తాగేలా చేసాను అంటూ వర్మ ట్వీట్ చేయడం పెద్దదుమారం రేపింది. 

తెలంగాణ రాజకీయ నేతలైన కొండా మురళి, కొండా సురేఖల బయోపిక్ వర్మ తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్జీవీ వరంగల్ వెళ్లారు. ముందుగా వర్మ వరంగల్ లో ర్యాలీ ప్లాన్ చేశాడు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

సినిమా ప్రారంభించిన అనంతరం వర్మ మైసమ్మ దేవాలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా మైసమ్మకు విస్కీ ఇచ్చాడు. ఒక ఫొటోలో వర్మ విస్కీ గ్లాసు చేతిలో పట్టుకున్నాడు. దానికి చీర్స్ అని వర్మ ట్వీట్ చేశాడు. మైసమ్మకు విస్కీ పోసిన ఆర్జీవీపై తీవ్ర స్థాయిలో అమ్మవారి భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దేవుళ్లపై నమ్మకం లేకపోతే లేకపోయింది. అంతేకానీ.. ఇలా ఆచారాలను హేళన చేయడం మంచిది కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కత్తి మహేష్ కు పట్టిన గతే ఆర్జీవికి పడుతుందంటూ తిట్టిపోస్తున్నారు.

మైసమ్మ తల్లితో ఆటలు ఆడుకోవద్దు.. అమ్మవారికి ఆగ్రహం తెప్పించేలా ప్రవర్తించొద్దంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వర్మ పోస్టు ట్వీట్ వైరల్ అవుతుంది. కొండా బయోపిక్ మూవీలో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ నటించగా.. ఈ బయోపిక్ మొత్తం వరంగల్ లోనే షూటింగ్ పూర్తి చేశారు.
Also Read : Samantha : చైతూతో బ్రేకప్.. సోలోగా ఉండే సమంత మకాం ఇకపై అక్కడేనంట!