Telugu NewsEntertainmentSamantha: సామ్ గ్లామర్ డోస్ ఎందుకు పెంచిందో తెలిసిందోచ్.. వామ్మో అందుకేనా?

Samantha: సామ్ గ్లామర్ డోస్ ఎందుకు పెంచిందో తెలిసిందోచ్.. వామ్మో అందుకేనా?

Samantha: పొరుగింటి పుల్లకూర రుచి అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీన్నే నమ్ముకుంటున్నారు చాలా మంది హీరోయిన్లు. సౌత్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకున్న వీరు… మెల్లగా బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అక్కడ స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కోవలోనే క్రేజీ హీరోయిన్ సమంత కూడా అటుగా అడుగులు వేస్తోంది. ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సామ్… తొలి సినిమాతోనే అందరినీ మాయలో పడేసింది.

Advertisement
heroine-samantha-comments-on-minister-ktr
heroine-samantha-comments-on-minister-ktr

ఆ తర్వాత సూపర్ స్టార్ మేహష్ బాబు దూకుడు సినిమా ఆ అమ్మడు కెరియర్ కు మరింత బలాన్ని చేకూర్చింది. అక్కడి నుంచి సామ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తెలుగులోనే కాదు తమిళంలో ఈమె బిజీ అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేస్కున్న నాగ చైతన్యతో విడాకులు తీస్కోబోతున్నట్లు తెలిపి అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక అప్పటి నుంచి గ్లామర్ డోస్ పెంచి కుర్రకారు గుండెల్లో సెగ పుట్టిస్తుంది. హాట్ హాట్ లుక్స్ తో అందరికీ పిచ్చెక్కిస్తుంది. అయితే ఈమె ఇంతగా గ్లామర్ డోస్ పెంచడానికి కారణం… బాలీవుడ్ లో విపరీతమైన అవకాశాలు రావాలనేన తెలుస్తోంది.

Advertisement

 

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు