Rakul preet singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందాల తార రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ పంజాబీ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ నటిస్తోంది. తన అందం,అభినయంతో అనేక అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవలే రన్ వే 24, ఎటాక్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా… ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలై వైరల్ గా మారింది.
సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్ లో శిక్షణ తీస్కుంది. ఇందులో భాగంగానే పసూరి పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకుంటూ ఆ సాంగ్ తన ఫేవరెట్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఓ మై గాడ్, వాట్ ఏ డ్యాన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదండోయ్ రకుల్ బాయ్ ఫ్రెండ్, యాక్టర్ జాకీ భగ్నాని డియర్ లవ్.. నాకు కూడా నేర్పించవా అని కామెంట్ చేశాడు. అయితే రకుల్ డ్యాన్స్ చేసిన పసూరి సాంగ్ యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్ ని సొంతం చేస్కుంది.
View this post on Instagram