...

Rahul ramakrishna: టీవీ9 పై రాహుల్ రామకృష్ణ ఫైర్.. వరుస ట్వీట్లతో విశ్వక్ సేన్‌కు సపోర్ట్!

Rahul ramakrishna : ఇటీవలే హీరో విశ్వక్ సేన్.. టీవీ9, టీవీ9 యాంకర్ దేవి నాగవల్లిల మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నడి రోడ్డుపై ఆయన ఓ ప్రాంక్ వీడియో చేశారు. అయితే వీడియోనే టీవీ9 ఛానెల్ ఇంకా యాంకర్ నాగవల్లితో వివాదానికి దారి తీసింది. అయితే చాలా మంది టీవీ9 ను, యాంకర్ దేవి నాగవల్లిని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు విశ్వక్ సేన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ కమెడియన్ రాహుల్ కరామకృష్ణ.. విశ్వక్ సేన్ కు సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే తన మనసులో ఉన్న మాటలన్నిటినీ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ… సదరు టీవీ ఛానెల్ ను ఏకిపారేశాడు.

Rahul ramakrishna
Rahul ramakrishna

“ఇప్పుడున్న జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్ లో నేను కూడా భాగమవుదామనుకుంటున్నా. విశ్వక్ సేన్ ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్ వాళ్లు కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తుంటారు. నీచమైన రూపంలో ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది. సదరు ఛానెల్ న్యూస్ తప్ప మిగతావన్నీ కవర్ చేస్తారంటూ, వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి” అంటూ సంచలన కామెంట్లు చేశాడు. అంతే కాకుండా ఈ మొత్తం వివాదంపై టీవీ9 ఛానెల్ వాళ్లు పిలిస్తే.. లైవ్ డిబెట్ లో పాల్గొంటానంటూ వరుస ట్వీట్లు చేశారు. అయితే ఈ ట్వీట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.