Rahul ramakrishna : తాగి ట్వీట్ చేశావా అంటే.. ముక్కుసూటిగా రిప్లై ఇచ్చిన రాహుల్ రామకృష్ణ!

Rahul ramakrishna : అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రతో ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జాతి రత్నాలు, కల్కి, స్కైలాబ్ వంటి సినిమాలతో అలరించాడు. ఇటీవలే హ్యాపీ బర్త్ డే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ఈయన ట్విట్టర్ విదకగా తన అభిమానులతో ముచ్చటించాడు. బోర్ కొడుతోంది ఏవైనా ప్రశ్నలు అడగండని తాను రిప్లై ఇస్తానని అభిమానులకు చెప్పాడు. దీంతో నెటిజెన్లు తమకు నచ్చిన ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజెన్లు క్రేజీ క్రేజీ ప్రశ్నలు అడగ్గా… రాహుల్ రామకృష్ణ ముక్కుసూటిగా సమాధానం చెప్పాడు.

మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటని అడ్గా.. బెటర్ కాల్ సాల్ అని చెప్పాడు. ఈమధ్య నీలెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువ మంది మాట్లాడతారు, నీవు చాలా బాగా మాట్లాడతావు, దీనికేమైనా ప్రాక్టీస్ చేస్తావా అని ప్రశ్నించగా.. మాతృభాషకు హోంవర్క్ అక్కర్లేదిని వివరించాడు. అలాగే తాగేసి ట్వీట్లు చేసిన సందర్భాలు ఏవైనా ఉన్నాయని అని అడిగితే.. చాలా సార్లు అంటూ రాహుల్ సమాధానం చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

Read Also : Sri Reddy Fish Curry : అరె.. ఎంట్రా ఇది.. శ్రీ రెడ్డి చేపల కూర ఇది.. ఒంపు సొంపులతో అందాలను ఆరబోస్తూ వండేస్తోందిగా..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel