Police officer: ప్రాణాలకు తెగించి.. పీకల్లోతు నీటిలో దూకి మునిగిపోతున్న ఓ వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ జియాగూడ వద్ద వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన నెటిజెన్లు ఎస్ఐను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హైదరాబాద్ జియాగూడ వద్ద మూసీ ఉద్ధృతితో నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని పోలీసులు కాపాడారు. మంగళ వారం రాత్రి ఫురానాపూల్ వంతెన వద్ద నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మునిగిపోతున్నాడని సమాచారం అందుకున్న మంగల్ హాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి మరీ ఎస్ నీళ్లలో దూకి కాపాడారు. అనంతరం మంగల్ హాట్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ రాజుతో పాటు హజీబ్ నగర్ సీఐ సైదులు సదరు వ్యక్తిని రక్షించి… చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇది ఇలా ఉండగా… ఈ వర్షాల కారణాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం మనం అందరికీ తెలిసిందే. సొంత ఊరులను విడిచి పట్టి ప్రాణాలను రక్షించుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అంతే కాకుండా ఈ వరద వల్ల ఎంతో మంది ఉపాదిని కోల్పోవడమే కాకుండా ప్రాణాలను కూడా కోల్పోయారు. మనుషులకే కాదు మూగజీవాలు కూడా కనుమరుగయ్యాయి. ఇది ఇలా ఉండగా నీటి ప్రవాహాలకు కొండ చరియలు కూడా పడిపోతున్నాయి.