Akira nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ తన మల్టీ టాలెంట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను గెలుచుకుంటూ ఉండే ఇతను… తాజాగా మేజర్ సినిమాలోని హృదయమా… అంటూ సాగే సాంగ్ ను కీబోర్డుతో కంపోజ్ చేసి అందరి హృదయాలను కదిలించాడు. హీరో అడవి శేష్ కోసం ఈ సాంగ్ ను కంపోజ్ చేసి పంపించాడు అకీరా నందన్. ఈ వీడియోని అడవి శేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా… తెగ వైరల్ అవుతోంది.
” నా కోసం సాంగ్ కంపోజ్ చేసి పంపించినందుకు అకీరా నందన్ కు చాలా థాంక్యూ” అంటూ అడవి శేష్ ట్వీట్ చేశాడు. అకీరా నందన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను మీరు కూడా ఓసారి చూడండి అంటూ అడవి శేష్ వీడియోను పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ జూనియర్ పవర్ స్టార్ అంటూ అకీరాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ మేజర్ సినిమా అడవి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శశి కిరణ తిక్కా డైరెక్షన్ లో వచ్చి ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
Thank you dear #Akira for sending me this. Heart is full. Love you ❤️ @SricharanPakala Check out Akira’s beautiful cover rendition of #Hrudayama / #Saathiya #MajorTheFilm 🇮🇳 pic.twitter.com/UouvZFpTmi
— Adivi Sesh (@AdiviSesh) June 16, 2022
Read Also : Akira nandan : అడవి శేష్ కు అకిరా నందన్ అంటే చాలా ఇష్టం అంట.. ఎందుకో తెలుసా?