Nuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ సీరియల్.. వికీతో ఇంటికి వచ్చిన మాయ.. పద్మావతి వంటకు ఫిదా అవుతున్న కస్టమర్లు..!

Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode

Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి తన మనసు మార్చుకుని వాళ్ళ అత్త ఇంటికి తిరిగి వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అరవింద విక్కీ, మాయ ల కోసం హారతి తీసుకొని బయటకు వస్తుంది. ఏంటండీ వీళ్లు ఇంకా రాలేదు అంటుంది. అప్పుడు కృష్ణ వస్తారులే రాణమ్మ కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంట కదా టైం పడుతుందిలే అయినా గుమ్మం దాకా వచ్చిన వాళ్లు ఇంట్లోకి రాకుండా ఉంటారా చెప్పు అంటాడు.

ఏమో అండి మీరు నానమ్మ నీ బ్రతిమలాడి మాయ నీ ఇక్కడికి రప్పిస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయమేస్తుంది అంటుంది. ఏం కాదులే రాణమ్మ నేను ఉన్నాను కదా అంటాడు కృష్ణ. ఒకవేళ మాయ ఇక్కడికి రాకపోతే ఇక విక్కీ జీవితాంతం బ్రహ్మచారి లాగానే ఉండిపోతాడు అంటాడు. అప్పుడు అరవింద అలా జరగకూడదు అండి విక్కీ తన ఇష్టమైన అమ్మాయి ని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉండాలి అంటుంది.

Advertisement
Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode

ఇక విక్కీ మరియు మాయ ఇంటికి వస్తారు. అప్పుడు అరవింద వారిని ఆగమని చెప్తుంది. అప్పుడు మాయ ఎందుకు హాల్ ఇంకా క్లీన్ చెయ్యలేదా అంటుంది. ఇప్పుడు అరవింద అది కాదు మాయ మీరిద్దరూ కలిసి ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారు కదా హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలి అంటుంది. అప్పుడు మాయ అరవింద గారు ఇలాంటి మూఢ నమ్మకాలు నేను నమ్మను అంటుంది. అప్పుడు అరవింద వాళ్ళ నానమ్మ మన ఆచార సాంప్రదాయాలు తెలియనివారికి నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు నువ్వు హారతి ఇచ్చి వాళ్ల ముందు తగ్గుతావా అంతే కాకుండా మన ఇంటి గౌరవం కూడా తగ్గిస్తావా అంటుంది.

అప్పుడు కృష్ణ అమ్మమ్మ ప్లీజ్ కాదనకండి మేము చిన్నవాళ్ళం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సినది మీరే తను పెరిగిన వాతావరణం అలాంటిది పైగా తను మన ఇంటికి వచ్చిన అతిధి హారతి ఇవ్వడం వల్ల మన ఇంటి గౌరవం పెరుగుతుంది. కాదనకండి హారతి ఇవ్వమనండి అని చెప్తాడు. రాణమ్మ హారతి ఇవ్వు అనగానే అరవింద హారతి ఇస్తుంది. అప్పుడు మాయ ప్లీజ్ అరవింద గారు నాకు స్మోక్ పడడం లేదు పైగా నా మేకప్ కరాబ్ అవుతుంది అంటుంది.

Advertisement

అప్పుడు వాళ్ళ నానమ్మ చెప్తే వినవు కదా అనగానే అయిపోయింది నానమ్మ అంటుంది. ఇక అరవింద మాయని కుడికాలి లోపలపెట్టి ఇంట్లోకి రా అంటుంది. అప్పుడు మాయ ఎడమ కాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తుంది. అప్పుడు కృష్ణ కోప్పడకండి. అమ్మమ్మ మొత్తం అన్ని విదేశీ చదువులు కదా తనకి తెలియదు అంటాడు. ఇక అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఇక పద్మావతి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వస్తుంది.

ఇక అక్కడే దాబా లో ఉన్న బాబాయ్ పద్మావతి వాళ్లను చూసి అక్కడికి వస్తాడు. ఏంటి భేటీ మీరు వెళ్లలేదా అంటాడు. అప్పుడు పద్మావతి మేము ఎక్కడికి వెళ్లట్లేదు మా మేనత్త దగ్గరే ఉంటాము అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త మురళి ఉంటే కాస్త సాయం చేసేవాడు అంటుంది. అది విన్న బాబాయ్ మురళి ఇందాక ఇక్కడికి వచ్చాడు భేటీ మీరు లేరని చెప్పగానే వెళ్ళిపోయాడు. కానీ ఆయన మొహంలో మీరు లేరు అనే బాధ కన్నా సంతోషమే కనిపించింది అంటాడు.

Advertisement
Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode

ఇక అరవింద మాయకు సైగచేసి నానమ్మ కాళ్ళకి దండం పెట్టు అంటుంది. అప్పుడు మాయ ఆమె కాళ్ళకు దండం పెడుతుంది. వెంటనే వాళ్ళ నానమ్మ ఆచారం సంప్రదాయం అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు అంటుంది. అప్పుడు మాయ ఇందాకటి నుండి నానమ్మ ఆచారం సాంప్రదాయం అంటుంది అంటే ఏమిటి అని అడుగుతుంది. వెంటనే డ్రైవర్ మాయ లగేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తాడు. సార్ మేడమ్ లగేజ్ ఎక్కడ సర్దాలి అంటాడు. అప్పుడు మాయ ఎక్కడ ఏంటి విక్కీ రూమ్ లో సర్దు అంటుంది.

విక్కీ నీతో కలిసి ఉండాలనే కోరిక ఇంత త్వరగా తీరుతుంది అని నేను అస్సలు అనుకోలేదు అంటుంది. అని నేను అస్సలు అనుకోలేదు అంటుంది. అప్పుడు డ్రైవర్ లగేజ్ తీసుకుని వెళ్తుంటే రాము ఆగు ఆ లగేజ్ ని గెస్ట్ రూమ్ లో పెట్టు అని చెప్తుంది. మాయ అదేంటి అమ్మమ్మ లివింగ్ అంటే మా ఇద్దరు నీ కలిసి ఉండమని కదా మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు అంటుంది. నిన్ను విక్కీ తో కలిసి ఉండడానికి కాదు ఇక్కడికి పిలిచింది. నీ ఆచారాలు అలవాట్లు తెలుసుకుందామని ఇక్కడికి పిలిచాము అయినా పెళ్లి కాకముందు ఒకే రూమ్‌లో ఎలా ఉంటారు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నేను చెప్పింది వినాల్సిందే అంటుంది వాళ్ళ అమ్మమ్మ.

Advertisement

Nuvvu Nenu Prema Serial : పద్మావతితో వంటతో బాబాయ్ హోటల్‌కు క్యూ కట్టిన కస్టమర్లు..

Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug 2 Today Episode

ఇక పద్మావతి మరియు అను లు దాబా లో కూర్చుంటారు. అప్పుడు ఆ బాబాయ్ ఏమైంది పద్మావతి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. పద్మావతి మా ఊర్లో మాకు ఒక బట్టల షాప్ ఉండేది. అది అనుకోని కారణాలవల్ల మూతపడాల్సి వచ్చింది. ఇప్పుడు మేం మల్ల మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి వాళ్లకి భారం కావడం ఎందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము అంటుంది.

ఇక్కడే ఉండి ఏదో ఒక బిజినెస్ పెట్టుకుందాము అనుకుంటున్నాను ఏమైనా ఐడియా ఉంటే చెప్పు బాబాయి అని అడుగుతుంది. అప్పుడే దాబా కి కొంత మంది కస్టమర్ వస్తారు. వెజ్ మిల్స్ కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆ బాబాయ్ ఇక్కడ వెజ్ మీల్స్ దొరకదు కేవలం బిర్యాని మాత్రమే దొరుకుతుంది అని చెప్తాడు. అది విన్న పద్మావతి మీరు ఆర్డర్ తీసుకోండి బాబాయ్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్తుంది. అప్పుడు ఆ బాబాయ్ ఇక్కడ వెజ్ మీల్స్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అమ్మా అంటాడు. మీకు ఎందుకు నేను చేస్తాను కదా మీ పేరు నిలబెట్టే బాధ్యత నాది అంటూ వంట రెడీ చేస్తుంది. ఇక బాబాయిని పిలిచి వంట సిద్ధమైంది వాళ్లకు వడ్డించండి అంటుంది.

Advertisement

ఇక బాబాయ్ వచ్చిన కష్టమర్‌కి భోజనం పెడతాడు. పద్మావతి ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్లకి వంట నచ్చుతుందో లేదో అని అప్పుడు కస్టమర్స్ మీరు చేసిన వంట చాలా బాగుంది. అచ్చం ఇంటి భోజనం తిన్న ఫీలింగ్ లాగా అనిపించింది. ఇలాంటి భోజనం ఎక్కడ చేయలేదు అంటారు. ఇక పద్మావతి వాళ్ళ మాటలు విని సంతోషపడుతుంది. పద్మావతి వంట చేసినందుకు బాబాయ్ డబ్బులు ఇస్తాడు నాకేం వద్దు అంటుంది. అప్పుడు ఆ బాబాయ్ ఇది నీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం భేటీ తీసుకో అంటాడు. ఇక రేపు జరగబోయే ఎపిసోడ్ లో ఏమవుతుందో చూద్దాం.

Read Also : Nuvvu Nenu Prema Serial : సొంత బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్న పద్మావతి.. మాయను ఇంటికి తీసుకెళ్లిన విక్రమాధిత్య..

Advertisement