Nuvvu Nenu Prema Serial : సొంత బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్న పద్మావతి.. మాయను ఇంటికి తీసుకెళ్లిన విక్రమాధిత్య..

Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా అరవింద మురళికి కాల్ చేస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. పద్మావతి వాళ్ళ అత్త చెప్పిన మాటలు విని మనసు మార్చుకుంటుంది. ఆటో ఆపి వెనక్కి మళ్ళిస్తుంది. ఏమైంది అమ్మి అని వాళ్ళ అక్క అనగానే మనం ఇక తిరుపతి వెళ్లక్కర్లేదు. మనం ఇక్కడే ఉండి ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాం అని చెప్పి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అరవింద వాళ్ళ ఆయన కృష్ణ కి కాల్ చేస్తుంది.

Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode

ఎక్కడ ఉన్నారండి అనగానే వాయిస్ లో ఏదో తేడా కనిపిస్తుంది. నిజమే చెప్పాలి అని చెప్పి మధురవాడ లో ఉన్నాను రాణమ్మ అంటాడు. ఇక అక్కడే ఉన్న అరవింద మరియు విక్కీ ని చూస్తాడు. అప్పుడు అరవింద ఏంటండీ మీరు ఎక్కడ ఉన్నారు అనగానే ఒకతనికి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. మీలాంటి మంచి వారు నా భర్తగా దొరికినందుకు నేను చాలా అదృష్టమంతు రాలిని అంటుంది. నేను కాదు రాణమ్మ నువ్వు చాలా మంచి దానివి అని అంటాడు కృష్ణ. ఇక అరవింద నేను మీ బావగారు కలిసి ఇంటికి వెళ్తాము నువ్వు వెళ్లి మాయ ని తీసుకొని రా అంటుంది.

పద్మావతి ఆటోను ఆపి అందరి చేత కొబ్బరిబోండాలు తాపిస్తుంది. ఎందుకు అమ్మి ఇప్పుడే కొబ్బరిబొండాలు అనగానే పద్మావతి మంచి ఐడియాలు రావడానికి అంటుంది. ఏం ఐడియా చేస్తున్నవ్ అని వాళ్ళ అక్క అడగగానే మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త ఏంది అమ్మి నేను ఉద్యోగం కదా నిన్ను చేయమన్నది అంటుంది. అప్పుడు పద్మావతి ఉద్యోగం చేస్తే మళ్లీ ఆ తింగరోడు లాంటి వాడు తగిలాడు అనుకో మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా ఉద్యోగం చేస్తే ఆరోగ్యం కరాబ్ అవుతుంది అలాగే పైసలు కూడా సరిగ్గా రావు. అదే మనం సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే మనమే ఒకరికి పని ఇవ్వొచ్చు అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క ఏ బిజినెస్ పెడదామనుకుంటున్నాను అమ్మి అనగానే అందుకే కదా మంచి ఐడియా రావడం కోసం కొబ్బరిబోండం తాగుతున్నాము అని చెబుతుంది.

Advertisement
Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode

ఇక మాయ విక్కీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక విక్కీ మాయ వాళ్ళ ఇంటికి వస్తాడు. రా విక్కీ నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ నానమ్మ కు నచ్చినట్టుగా మీ ఇంట్లో నడుచుకుంటాను ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అంటుంది. అప్పుడు విక్కీ నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు ఒకరి కోసం నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు చాలు అంటాడు. అప్పుడు మాయ నాకు తెలుసు విక్కీ నీ గురించి ఒకరికోసం కాంప్రమైజ్ అవ్వడం నీకు ఇష్టం ఉండదు. దీన్ని బట్టి తెలుస్తుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అంటుంది. ఇక నేను అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టను నిన్ను కూడా అంటుంది. విక్కీ ఇక వెళ్దామా అనగానే ఉండు నా లగేజ్ తెచ్చుకుంటా అని చెప్పి ఇంట్లో కి వెళుతుంది. ఇక మాయ ఇదే మంచి ఛాన్స్ ఇంట్లో వాళ్ళందర్నీ మేప్పించి విక్కీ చేత తాళి కట్టించుకున్నాను అంటుంది. ఇక లగేజ్ తీసుకుని బయటికి వస్తుంది. విక్కీ, మాయ కలిసి ఇంటికి వెళతారు.

Nuvvu Nenu Prema Serial : వికీ, మాయను చూసిన పద్మావతి ఏం చేసిందంటే?

Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode

ఇక పద్మావతి వాళ్ళ అత్త ఒసేయ్ ఐడియా అని చెప్పి నా చేత 7 కొబ్బరిబొండాలు తాగించావు. ఐడియా ఏమో గానీ నా కడుపు చెరువు అయింది అంటుంది. ఇక వాళ్ళ అక్క కూడా నాది కూడా అదే పరిస్థితి అమ్మి అంటుంది. అప్పుడు పద్మావతి అత్త నాకు ఒక ఐడియా వచ్చింది మనం మళ్ళీ చీరలు బిజినెస్ స్టార్ట్ చేద్దామా అంటుంది. అదే మంచిగా ఉంటే నేను ఎందుకు ఖాళీగా ఉండే దాన్ని అమ్మి నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా అంటుంది. మరి ఏం చేద్దాం అనగానే అను మనం పెట్టుబడి పెట్టడానికి డబ్బులు కావాలి కదా మరి మనం ఉన్న పరిస్థితుల్లో డబ్బులు ఎలా వస్తాయి అంటుంది.

అప్పుడు వాళ్ళ అత్త నేనైతే ఒక పది వేలు సర్దుతాను అంతకంటే ఎక్కువ నావల్ల కాదు అంటుంది. ఇక అను తక్కువ పెట్టుబడి తో పెట్టే బిజినెస్ ఏమైనా ఉందేమో ఆలోచించు అమ్మి అంటుంది. ఇక పద్మావతి కుడి కన్ను అదురుతుంది. ఏంటి ఇక్కడ ఆ టెంపరోడు లేడు కదా మరి నాకేంటి కుడి కన్ను అదురుతుంది అనుకుంటుంది. మంచి బిజినెస్ పెట్టి వాడి కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాలి శ్రీనివాస ఏదో ఒక ఐడియా నువ్వు ఇవ్వు తండ్రి అనుకుంటుంది. ఇక పద్మావతి అక్కడే కార్ లో ఉన్న విక్కీ మరియు మాయని చూసి అందుకేనేమో నాకు కుడి కన్ను అదిరింది అనుకుంటుంది. ఇక మాయ కూడా పద్మావతిని చూసి విక్కీ కి కనబడకుండా కార్ గ్లాస్ వేస్తుంది. ఇక ఆర్య పద్మావతి వాళ్ళ ఇంటికి వెళతాడు. నా గురించి అపార్థం చేసుకొని అందుకే అను వెళ్లి పోయిందేమో అనుకుంటాడు.

Advertisement

ఇక అక్కడే దాబా లో ఉన్న బాబాయ్ ఆర్య ని చూసి ఆర్యభట్ట ఇక్కడికి రా అని పిలుస్తాడు కూర్చో బేటా ఏంటి అను కోసం వచ్చావా అంటాడు. ఇక పద్మావతి వాళ్లు రారు తిరుపతి వెళ్లిపోయారు అని చెబుతాడు. నీ ప్రేమ ఇలా మధ్యలోనే ఆగిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అంటాడు. నీ ప్రేమకి ఒక శత్రువు ఉన్నాడు ఇలా నీ ప్రేమ మధ్యలో ఆగిపోవడానికి గల కారణం పద్మావతి ని బాధపెట్టిన ఆ విక్రమాదిత్యునే అతని వల్లే వాళ్ళు ఇక్కడి నుండి వెళ్లిపోయారు. నీకు ఒకటి తెలుసా ఆర్య బేటా ఇప్పుడే ఆ విక్రమాదిత్య పద్మావతి కోసం ఇక్కడికి వచ్చాడు అనగానే ఆర్య ఏంటి విక్కీ ఇక్కడికి వచ్చాడ అంటాడు. అప్పుడు అతను ఏంటి విక్కీ నా అనగానే అప్పుడు ఆర్య అదే విక్రమాదిత్య అంటాడు. అతన్ని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది ఆర్య బేటా అతని చెడామడా తిట్టి ఇక్కడ నుండి పంపించాను అంటాడు. ఆర్య విక్కీ ఇక్కడికి వచ్చాడు అంటే నమ్మలేకపోతున్నాను.

Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode
Nuvvu Nenu Prema Serial Aug1 Today Episode

తను పద్మావతిని బాధపెట్టిన గిల్టీ ఫీలింగ్ తోనే ఇక్కడికి వచ్చాడా అంటే తనలో ఎంతో కొంత మార్పు వచ్చి ఉంటుంది అనుకుని సరే బాబాయ్ నేను వెళుతున్నాను నాకు పని ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక పద్మావతి నేనేంటి బిజినెస్ గురించి ఆలోచించకుండా ఆ టెంపరోడీ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటుంది. ఇక విక్కీ కూడా పద్మావతి గురించి ఆలోచిస్తాడు. అప్పుడు మాయ ఏంటి విక్కీ ఏం ఆలోచిస్తున్నావు నేను నీ పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటావు కదా మరి ఏంటి ఇప్పుడు అలా ఉన్నావు అంటుంది.

అదే నాకు అర్థం కావట్లేదు అంటాడు విక్కీ. అప్పుడు మాయ ఏంటి విక్కీ ఏమైనా మాట్లాడు అనగానే విక్కీ ప్లీజ్ మాయ నేను ఇప్పుడు మాట్లాడను కావాలంటే ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటాడు. అప్పుడు మాయ ఇప్పుడు విక్కీ ని డిస్టర్బ్ చేస్తే నా మీద ఉన్న ఒపీనియన్ పోతుంది ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలి అనుకుంటుంది. ఇక పద్మావతిని చూసి వాళ్ళ అత్త ఏంటి అమ్మి సంతోషంగా ఉన్నావు ఏమైనా ఐడియా వచ్చిందా అంటుంది. అప్పుడు పద్మావతి లేదు అత్త కానీ నేను ఏ బిజినెస్ పెట్టిన సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తానని కాన్ఫిడెంట్ వచ్చింది. పద్మావతి పద్మావతి ఇక్కడ తగ్గేదే లే అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Read Also :  Nuvvu Nenu Prema Serial : పద్మావతి దూరమవుతోందని తెలిసి, ఆందోళన లో విక్రమాదిత్య !  

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel