Naraka chathurdashi : అశ్విని మాసంలో వచ్చే చివరి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ దీపావళి పండుగను చిన్నా పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటారు. అయిదే ఈ దీపావళి సమయంలో నరక చతుర్దశి అనేది అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. త్రయోదశి అనగా అశ్విని మాసంలోని కృష్ణపక్షం ధంతేరస్ నుండి ప్రారంభం అవుతుంది. దీపావళి పండుగకు ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజున నూనెతో స్నానం చేసే ఒక సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే శుభ సమయం, పూజా విధానం, అలాగే కొన్ని పద్దతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్విని మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ అక్టోబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 24 సాయంత్రం 5.27 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ ఏడాది అక్టోబర్ 24 నరక చతుర్దశి అలాగే దీపావళి వచ్చాయి. అభ్ంగ షన్న ముహూర్తం 24 అక్టోబర్ 2022 ఉదయం 5.28 నుంచి 6.31 వరకు అంటే మొత్తం 1 గంట 23 నిమిషాలు.
కౌళీ చౌదాస్ ముహూర్తం విషయానికి వస్తే.. కాళీ చౌదాస్ ను అక్టోబర్ 23వ జరుపుకుంటారు. అక్టోబర్ 23, 2022వ తేదీ 11.42 నుంచి అక్టోబర్ 24, 2022, 12.33 తేదీ వరకు నరక చతుర్దశి రోజు ఏం చేయాలంటే… నరక చతుర్దశి రోజున ఉదయాన్నే శరీరానికి నూనె రాసుకొని తలస్నానం చేయాలి. అయితే పురాణాల ప్రకారం నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు. అందుకే శ్రీకృష్ణుడిని ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
Read Also : Solar Eclipse 2022 : ‘దీపావళి’ నాడు శక్తివంతమైన సూర్యగ్రహణం.. అత్యంత గడ్డు సమయం.. ఈ రాశులవారిని ఆ దేవుడే కాపాడాలి..!
Read Also : Diwali 2022 : దీపావళి వెళ్లగానే ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. అదృష్టమే..అదృష్టం.. మీ రాశి ఉందేమో చూసుకోండి!