Intinti Gruhalakshmi November 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి కొత్త ఇల్లు దొరికినందుకు ఆనందపడుతూ ఉంటుంది.
ఈ ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ కి ఒక గిఫ్ట్ ఇవ్వగా వెంటనే తులసి నాకు మీ స్నేహం చాలు గిఫ్ట్ అవసరం లేదు అని అంటుంది. అప్పుడు సామ్రాట్ స్నేహానికి గుర్తుగానే ఈ గిఫ్ట్ తులసి గారు అని అంటాడు. అప్పుడు తులసి ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగా అందులో చైన్ చూసి తులసి షాక్ అవుతుంది. చాలా బాగుంది సామ్రాట్ గారు అని అంటుంది. ఇప్పుడు సామ్రాట్ కూడా సంతోషపడుతూ మీకు ఈ ఇల్లు సంతోష నిలయం కావాలని కోరుకుంటున్నాను తులసి గారు అని అంటాడు.
అప్పుడు తులసికి సామ్రాట్ ఆ ఇంటి తాళాలు ఇవ్వగా వెంటనే సులసి నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం నా వాళ్ళు ఎవరూ లేరు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి ఆటోలో షాపింగ్ కోసమని బయటకు వెళ్తారు. అప్పుడు సామ్రాట్ కార్లో వెళ్లొచ్చు కదా అని అనగా నేనెదో చిన్నాచితకా షాపింగ్ కి వెళ్తున్నాను మీ కారులో వెళ్తే వంద రూపాయలు వస్తూ కూడా 500 రూపాయలకు కొనాలి అని అంటుంది. ఇప్పుడు సామ్రాట్ కూడా ఆ తాను వేసుకున్న కోటు తీసేసి వంద రూపాయల వస్తువు వందకి అంటాడు.
మరొకవైపు నందు లాస్య అనసూయ ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నా చెల్లిని నేను అలా రుణం తీర్చమని అడగకుండా ఉండాల్సింది అని నందు బాధపడుతూ ఉంటాడు. తన అకౌంట్ లో డబ్బులు అన్ని నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది అని నందు బాధపడుతూ ఉండగా వెంటనే లాస్య ఉండనీలే నందు మనం ఎలాగో ఉద్యోగాలు చేయడం లేదు కదా మన ఖర్చులకు పనికొస్తాయి అని అంటుంది. వెంటనే నందు నువ్వు ఇలా నన్ను దిగజారుస్తున్నావు అంటూ లాస్య మీద మండిపడతాడు.
Intinti gruhalakshmi నవంబర్ 9 ఎపిసోడ్ : లాస్య మీద మండిపడిన నందు..
అప్పుడు లాస్య నేను అన్నదాంట్లో తప్పు ఏముంది నందు మీ చెల్లెలు నిన్ను కాదు అనుకున్న విషయం నీకు గుర్తు లేదా అమ్మను అమ్మా అని పిలవడానికి కూడా తనకు ఇష్టం లేదని చెప్పింది కదా అంటూ నందుని మరింత రెచ్చగొడుతుంది లాస్య. అప్పుడు నందు నువ్వు నిప్పుకు మంట పెట్టేకి కాకుండా చల్లార్చేందుకు ప్రయత్నించు లాస్య అని సీరియస్ అవుతాడు. అప్పుడు అనసూయ మధ్యలో కలుగజేసుకొని నా బిడ్డ నాకు దూరం కావడానికి కారణం ఆ తులసి ఆమె వల్లే పుట్టింటితో మాధవి బంధాలు తెంపుకుంది అని అంటుంది.
అప్పుడు నిన్ను ఎప్పటికీ క్షమించను తులసి అని అంటుంది అనసూయ. మరొకవైపు సామ్రాట్ తులసి ఇద్దరు షాపింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు తులసి ప్రమిదలు కొనుగోలు చేస్తూ 50 రూపాయలు ఏంటి 20 ఇచ్చేలా ఉంటే చెప్పు తీసుకుంటా లేకుంటే వద్దు అని అనడంతో వెంటనే అతను నాకు ఇందులో వచ్చేది ఐదు రూపాయలు అమ్మ అంత తక్కువ ఇస్తే నాకు నష్టం వస్తుంది అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 50 కదా తీసుకొని తులసి గారు నేను డబ్బులు తాను అనగా వెంటనే తెలిసి నేను డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టాను అని వాదిస్తుంది.
ఇప్పుడు తులసి ఆమె దగ్గర మట్టి ప్రమోదలను ఆమె చెప్పిన రేటుకే తీసుకుంటుంది. అప్పుడు తులసి ప్రవర్తన చూసి ఆమె మెచ్చుకుంటుంది. మరొకవైపు నందు జరిగిన విషయం గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. నా కుటుంబం అంతా నాకు దూరం అవుతోంది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World