Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ దంపతులు వంటగదిలో దొంగగా పాయసం తింటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ దంపతులు పాయసం తింటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వాళ్ళందరూ వచ్చి దొంగలు దొరికేశారు అంటూ వారిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అనసూయ పాయసంలో సుగర్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను తులసి అని అనగా పాయసంలో కాదు అత్తయ్య మీ ఒంట్లో షుగర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అని అంటుంది.
అప్పుడు తులసి శృతి నేను సామ్రాట్ ఇంటికి వెళుతున్నాను వెళ్లి హనీ కోసం క్యారేజ్ కట్టు అని అంటుంది. మరొకవైపు సామ్రాట్ హనీ కోసం ఇండ్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ఇద్దరు కలిసి బయట హనీ కూర్చొని ఉండగా అక్కడికి వెళ్తారు. ఏమయింది హనీ అని అనగా మనసు బాగోలేదు నాన్న అని అంటుంది.
లాస్య దంపతులు లక్కీ అక్కడికి రావడంతో సామ్రాట్ వాళ్లు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు లక్కీ తో కలసి హనీ ఆడుకోవడానికి వెళుతుంది. ఇంతలోనే తులసి అక్కడికి రావడం చూసి నందు దంపతులు కుళ్లుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి నీ పిల్లల కోసం టిఫిన్ తెచ్చాను ముందు వాళ్లకు వడ్డిస్తాను అని లోపలికి వెళుతుంది.
ఇక తులసిని చూసి పిల్లలు ఆనంద పడుతూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలకు వడ్డిస్తూ ఉండగా అది చూసి నందు లాస్య ఇద్దరు కుళ్లుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లక్కీ అని ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటూ ఉండగా అది చూసి ఆనంద పడుతూ ఉంటాడు. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి హనీ ఆనందంగా ఉంది కదా సామ్రాట్ గారు ఇంకేమీ అని అనగా అది సాయంత్రం వరకే కదా తులసి గారు మళ్ళీ ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు అని అంటాడు సామ్రాట్.
అప్పుడు తులసి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది ఈరోజు నుంచి హనీ మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ హనీ ని చూడకుండా నేను ఉండలేను కావాలంటే మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ ఉండొచ్చు కదా అని అంటాడు. దాంతో తులసి ఆలోచిస్తూ నేను మా వాళ్ళందరిని అడిగి చెబుతాను అని అంటుంది.
మరొకవైపు లాస్య దంపతులు సామ్రాట్ ఇంట్లోనే ఆఫీస్ పెట్టినందుకు కుళ్ళుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తులసి ఇంటికి వెళ్లి ఇంట్లో అందరికీ ఆ మాట చెప్పడంతో అందరూ ఒప్పుకుంటారు. కానీ అవి మాత్రం నేను అసలు ఒప్పుకోను రాను అని అంటాడు. అప్పుడు వెంటనే తులసి అక్కడ ఏమైనా లోడ్ జరిగితే వెంటనే వెనక్కి వచ్చేద్దాం అని అనగా అందరూ సరే అని అంటారు. మరొకవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు.
ఇక రేపటి ఎపిసోడ్లో తులసి కుటుంబం అందరూ సామ్రాట్ ఇంటికి రావడంతో సామ్రాట్ వాళ్లు సంతోషపడుతూ ఉంటారు. ఇక తులసి కుటుంబం అందరూ కలసి హనీని సంతోష పడుతూ ఉండగా అది చూసిన నందు వెంటనే మా వాళ్ళను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అని గట్టిగా తులసి మీద అరుస్తాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World