Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అనడంతో అందరూ షాక్ అవుతారు.
ఈరోజు ఎపిసోడ్ లో జెస్సీ తండ్రి జ్ఞానాంబను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ, అఖిల్ నువ్వు వెనకేసుకొస్తూ నా కొడుకు ఏం తప్పు చేయలేదు అని అంటుంది. మీ కూతురితో పెళ్లి చేయడం అన్నది జరగని పని అని అనడంతో వాళ్లు షాక్ అవుతారు. నా నిర్ణయం లో ఏం మార్పు లేదు అని అంటుంది. రేపటి వరకు సమయం ఇస్తున్నాను రేపటిలోగా నీ కొడుకు నా కూతురికి పెళ్లి చేయకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంది అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జెస్సి తల్లిదండ్రులు.
అప్పుడు జ్ఞానాంబ జానకి మీద కోప్పడుతూ నీకు ఇచ్చిన గడువులోపు నిజం నిరూపించకపోతే ఆ అమ్మాయి పేరు ఇంట్లో వినిపించకూడదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు జానకి దంపతులు కూడా అఖిల్ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు.
మరొకవైపు అఖిల్ నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని టెన్షన్ పడుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ ఇంటి వద్ద వినాయకుడి నిమజ్జనం ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరొకవైపు మల్లికా జానకి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కలిసి వినాయకుడు హడావుడిలో ఎగురుతూ డాన్సులు చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి కారు వస్తుంది.
అప్పుడు కారులో నుంచి జానకి దంపతులు అలాగే జెస్సి,అఖిల్ పెళ్లి చేసుకుని రావడం చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. అప్పుడు మల్లికా ఎలాగైనా కొట్లాట జరగాలని లోపలికి వెళ్లి జ్ఞానంబతో అసలు విషయం చెప్పి జ్ఞానాంబ ని రెచ్చగొడుతూ ఉంటుంది. మరొకవైపు పూజ ముందు కూర్చున్న జ్ఞానాంబ మనసుకు అపశఖునంలా అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత జెస్సి అఖిల్ లోపలికి వెళ్తు ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వచ్చి ఆగమని చెబుతుంది. అప్పుడు మల్లిక,జ్ఞానాంబ ను మరింత రెచ్చగొడుతూ జానకికి ఇచ్చిన లైన్స్ అన్ని చెడిపోయింది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. కానీ జ్ఞానాంబ ఎం మాట్లాడకుండా జానకి ఆ కొత్త జంటకు హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్పు అని అంటుంది. దాంతో మల్లికా ఒక్క సారిగా షాక్ అవుతుంది.