AP Govt News: ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కారణంగా రాజకీయ వివాదంగా మారుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థానంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ… అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంది. మంత్రివర్గం ఆన్ లైన్ లోనే ఇందుకు ఆమోదం తెలిపింది.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎన్టీఆర్ పేరుతోనే ఈ యూనివర్సటీ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం సడన్ గా ఈ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు మూర్చాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ మంతిర శాసన సభలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిీ పేరు మార్పునకు సంబంధించి సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్ లైన్ లో మంత్రులకు ఈ సవరమలను పంపి కేబినేట్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. 1996లో దివంగత సీఎం ఎన్టీఆర్ మరణానంతరం దానికి ఆయన గుర్తుగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పేరు మార్చారు.