Nagnam beauty: నగ్నం బ్యూటీ శ్రీ రాపాక బిగ్‌బాస్ హౌస్‌ ఎంట్రీ..?

nagnam beauty big boss entry
nagnam beauty big boss entry

Nagnam beauty: బుల్లితెరపై ప్రజానికాన్ని కళ్లుతిప్పుకోకుండా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. మొన్నటి వరకు బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రేక్షకుల మొప్పు పొంది ఆ షోలో పార్టిసిపేట్‌ చేసిన వాళ్లకు మంచి గుర్తింపును అవకాశాలను అందించింది. కాగా త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 మొదలవనుందని టాక్‌ నడుస్తుంది. అయితే ఆ షోకు ఇప్పటి నుంచే సెలబ్రెటీల ఎంపిక ప్రక్రియ మొదలైనట్టు సమాచారం తెలుస్తుంది. అలాంటి షోకి “నగ్నం” బ్యూటీ స్వీటీ వస్తే ఎలా ఉంటుందో మరి చెప్పనక్కర‌లేదు. వర్మ స్కూల్ నుంచి వచ్చిన నగ్నం బ్యూటీ స్వీటీ అలియాస్ శ్రీరాపాక మరి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తుందా?

nagnam beauty big boss entry

Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 అలా ముగిసిందో లేదో మళ్లీ బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. సీజన్ 6 ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉండటంతో.. ఇంతలోనే బిగ్ బాస్ ఓటీటీ అంటూ ప్రయోగానికి తెరతీశారు. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతానికైతే 84 రోజులు అంటున్నారు కానీ.. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటే ఇంకా పెంచే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఇతర భాషల్లో బిగ్ బాస్ ఓటీటీ క్లిక్ కావడంతో.. తెలుగులో దాన్నే ఫాలో అవుతున్నారు. కాగా ఈసారి సెలబ్రిటీ షో పేరుకి తగ్గట్టుగానే సెలబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ కాగా.. ఈ లిస్ట్‌లో వర్మ స్కూల్ నుంచి వచ్చిన నగ్నం సుందరి శ్రీరాపాక ఉండటం కొసమెరుపు.

Advertisement

అసలే బిగ్ బాస్.. ఆపై నగ్నం బ్యూటీ.. అందులోనూ 24 గంటల షో అంటే ఎలాంటి నగ్న కార్యాలను చూపించబోతున్నాడో బిగ్ బాస్ అనేది టాక్ మొదలైపోయింది. సీజన్ 5లో అయితే ముద్దులు, హగ్గులు, బాత్ రూంలో దూరి రొమాన్స్‌లు.. చాలానే చేశారు. మరి ఈసారి బిగ్ బాస్ ఓటీటీలో ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అని ప్రజలు భావిస్తున్నారు.

వర్మ.. అప్పట్లో ఈ స్వీటీ పాపతో నగ్నం అనే  చిత్రాన్ని రూపొందించి ఆన్ లైన్‌లో రిలీజ్ చేశాడు. దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌ ఈ బ్యూటీ పనిచేసింది. కాగా ఈ స్వీటీ పాప అసలు పేరు శ్రీ రాపాక. ఊరు వెస్ట్ గోదావరిలోని దేవరపల్లి.

Advertisement