Telugu NewsLatestKarthika Deepam january 12 Today Episode : సౌందర్యకి అబద్దం చెప్పిన దీప కార్తిక్.....

Karthika Deepam january 12 Today Episode : సౌందర్యకి అబద్దం చెప్పిన దీప కార్తిక్.. సరికొత్త ప్లాన్ వేసిన మోనిత..?

Karthika Deepam january 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్యని చూసి దీప, కార్తీక్ టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ఇంద్రుడు చంద్రమ్మ ఇంటికి రావడంతో శౌర్య వెళ్లి అమ్మ నాన్నలు వచ్చారు పిన్ని అనడంతో ఇంద్రుడు దంపతులు షాక్ అవుతారు. ఏంటి పిన్ని అమ్మానాన్నలు వచ్చారు అంటే సంతోష పడాల్సింది పోయి షాక్ అవుతున్నారు అనగా అదేం లేదు బంగారు అంటూ కవర్ చేసుకుంటారు. లోపలికి వెళ్దాం పద పిన్ని అమ్మానాన్నలు పరిచయం చేస్తాను అని సౌర్య వాళ్ళని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. లోని సౌందర్య ఎదురు పడటంతో నా కొడుకు కోడలు కనిపించారు ఇంద్రుడు అని సంతోషంగా మాట్లాడుతుంది సౌందర్య.

Advertisement
Karthika Deepam january 12 Today Episode
Karthika Deepam january 12 Today Episode

ఇంతలోనే కార్తీక్ దీప అక్కడికి వచ్చి ఇంద్రుడు దంపతులు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్న ఇదిగో వీళ్ళే మా పిన్ని బాబాయ్ అన్నం తో మా కూతురిని బాగా చూసుకున్నందుకు చాలా థాంక్స్ అని అంటాడు. ఇప్పుడు దీప చాలా థ్యాంక్స్ చంద్రమ్మ అనడంతో అదేంటమ్మా నీకు మా పిన్ని ముందే తెలుసా అనగా అవునమ్మా నీకు పిన్ని పేరు ఎలా తెలుసు అని హిమ కూడా ప్రశ్నిస్తుంది. అప్పుడు సౌందర్య నిజం చెప్పు ఇంద్రుడు నా కోడలు గురించి నీకు ముందే తెలుసు కదా అని అనగా లేదమ్మా ఆరోజు చెప్పాను కదా తెలిస్తే మీకు ఎందుకు చెప్పకుండా ఉంటాను అనగా మనిద్దరం అమ్మ అయ్యగార్లను మొదటిసారి చూస్తున్నాం అని చంద్రమ్మ కూడా అబద్ధాలు చెబుతుంది.

Advertisement

అప్పుడు సరే అమ్మ మేము వెళ్లి వస్తాము అనడంతో ఎక్కడికి వెళ్తారు బాబాయ్ అని సౌర్య అడగగా మీ అమ్మ నాన్న దొరికారు కదా అమ్మ అనగా నీకు ముందే చెప్పాను కదా బాబాయ్ మా అమ్మ అన్నం దొరికిన తర్వాత అందరూ కలిసి ఇక్కడే ఉందామని అనగా సరే అని అంటారు. అప్పుడు సౌర్య ఇక్కడే ఉండి అందరము పండుగ సెలబ్రేట్ చేసుకుందాము అనగా హిమ మాత్రం హైదరాబాద్ కి వెళ్దాము అని అంటుంది. అప్పుడు ఎందుకు సౌర్య నాతో పోట్లాడుతావు అని వారిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా ఆపండి అని సౌందర్య అని ఇక్కడే పండగ సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్దాము అని అంటుంది.

Advertisement
Monitha new plan about karthik and deepa in today s karthika deepam serial episode
Monitha new plan about karthik and deepa in today s karthika deepam serial episode

ఆ తరువాత అందరు కలసి ముగ్గులు వేస్తూ ఉండగా ఇంతలో హేమచంద్ర ఏంటి దీపమ్మ ఎప్పుడు వచ్చావు అని అడగడంతో అంకుల్ మా అమ్మ నీకు ముందే తెలుసా అని హిమ, సౌర్య నిలదీస్తారు. అప్పుడు హేమచంద్ర అనవసరంగా నోరు జారి ఏం చెప్పాలి అని టెన్షన్ పడుతూ మీ అమ్మానాన్నల ఫోటో మీరే చూపించారు కదమ్మా అలా గుర్తుపట్టాను అని అంటాడు. అప్పుడు పోనీలే రారేమో అనుకున్నాను వచ్చారు అనడంతో మా అమ్మ నాన్నలు రారు అన్న సంగతి మీకు ఎలా తెలుసు అంకుల్ అని అంటుంది హిమ. మళ్లీ నోరు జారాను ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదో ఒక నోరు జారతాను అని అక్కడి నుంచి టెన్షన్తో వెళ్లిపోతాడు హేమచంద్ర.

Advertisement

అప్పుడు దీప పాపం అన్నయ్య మేము ఇక్కడికి రాగానే నన్ను చూసి టెన్షన్ పడ్డట్టు ఉన్నాడు ఒక మాట ముందే ఫోన్ చేసి చెప్పి ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ రోడ్డుపై వెళ్తూ ఉండగా మోనిత కారు అడ్డంగా పెట్టుకుని రోడ్డుకు అడ్డంగా నిల్చుని ఉంటుంది. నీకేంటి పిచ్చా ఎందుకు రోడ్డుకు అడ్డంగా పెట్టుకున్నావు అనడంతో ఏం చేస్తావు కార్తీక్ నీతో మాట్లాడాలి అంటే ఇలా అడ్డదారులు తొక్కాల్సి వస్తోంది అని అంటుంది. పది నిమిషాలు మాట్లాడాలి అలా వెళ్లి రెస్టారెంట్ కి వెళ్దాం పద అనడంతో నాకు అవసరం లేదు నువ్వు కారు పక్కకు తీయకపోతే నేను ఇలాగే కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాను అనగా సరే విను కార్తీక్ నువ్వు వెళ్లే లోపు మీ అమ్మగారికి ఫోన్ చేసి దీప కండిషన్ గురించి చెప్తాను అని అంటుంది.

Advertisement

నువ్వు అసలు మనిషివా పశువువా ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని సీరియస్ అవ్వడంతో కోప్పడకు కార్తీక్ నువ్వు చెప్పినట్టు వింటే ఇలాంటివి నేను చేయను కదా అని అంటుంది. అప్పుడు కార్తీక్ ని మోనిత బ్లాక్ మెయిల్ చేయడంతో చేసేదేమీ లేక మోనిత తో పాటు వెళ్తాడు కార్తీక్. తర్వాత దీప వంట చేస్తూ ఉండగా దీపమ్మ ఇదిగో కార్తిక్ సార్ ఇచ్చారు టాబ్లెట్స్ వేసుకో పిల్లలు చూడకముందే తొందరగా వేసుకోమ్మా అని అంటుంది. మీ సార్ పిచ్చి కానీ టాబ్లెట్లు వేసుకుంటే ఎక్కువ రోజులు బతుకుతానా అని అంటుంది దీప.

Advertisement

అలా మాట్లాడకు దీపమ్మ సారు మీకోసం ఎంతలా తాపత్రయపడుతున్నారు అని అంటుంది చంద్రమ్మ. నువ్వు పక్కకు రా దీపమ్మ నేను వంట చేస్తాను అని చంద్రమ్మ వంట చేయడానికి వెళుతుంది. మరొకవైపు కార్తీక్ మోనిత ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్ళగా ఏం తింటావు కార్తీక్ అనడంతో నువ్వు నన్ను తింటున్నావ్ సరిపోద్దా అని అంటాడు కార్తీక్. అలా మాట్లాడకు కార్తీక్ నువ్వు రాకపోయేసరికి అలా మాట్లాడాను అని అంటుంది. సరే కూర్చొ మోనిత మాట్లాడదాము, లేకపోతే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు కదా అనే కూల్ గా మాట్లాడడంతో ప్లీజ్ కార్తీక్ నాతో ప్రేమగా మాట్లాడు నాతో ప్రేమగా ఉండు చాలు నేను ఇంతకుమించి ఏం కోరుకోను అనడంతో ఎక్కువ మాట్లాడక మోనిత అని అంటాడు. సరే కార్తీక్ నువ్వు ఎలాగో నాకు దక్కవు అని అర్థం అయింది. చనిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను దగ్గరికి చేరనీయవు అని అర్థం అయింది అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది మోనిత.

Advertisement

Read Also : Guppedantha Manasu january 11 Today Episode : జగతికి థాంక్స్ చెప్పిన రిషి.. బాధతో కుమిలిపోతున్న జగతి..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు