Mompha Junior Kid : ఓరీ నీ బుడ్డోడా.. లగ్జరీ లైఫ్ అంటే నీదేరా.. ఎంతైనా రిచ్ కిడ్ కదా.. సూపర్ కార్లలో తిరిగేస్తున్నాడు. సొంత ప్రైవైట్ జెట్ ఉంది.. ఇప్పుడు విలాసవంతమైన భవనాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. 9ఏళ్ల వయస్సులోనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రైవేట్ జెట్ విమానంతో పాటు ఎన్నోసూపర్ కార్లు ఉన్నాయి. ఇంతకీ ఈ 9ఏళ్ల రిచ్ కిడ్ బుడ్డోడి స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే..

అతడే.. మొహమ్మద్ అవాల్ ముస్తఫా.. (Muhammed Awal Mustapha) అలియా్ మొంఫా జూనియర్.. మల్టీ మిలీయనీర్ నైజీరియన్ (Nigerian, internet celebrity) ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాయిలియా ముస్తఫాకు ముద్దుల కొడుకు. ఈ బుడ్డోడిది లైఫ్ లగ్జరీ.. అంతేకాదు.. ఇతడి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చూస్తే అర్థమైపోతుంది..
అందులోనూ ఈ బుడతడు రిచ్ కిడ్.. అలియా్ మొంఫా జూనియర్ ఇన్‌స్టా అకౌంట్‌కు 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే మాములోడు కాదు… అతడి ఇన్ స్టా అకౌంట్లో 9పోస్టులు పెట్టాడు.. 26వేల మంది ఫాలోవర్లను సంపాదించాడు. స్టైలిష్ క్లాతింగ్, సూపర్ కార్ల పక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. పైగా ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసేస్తున్నాడు.

ప్రైవేట్ జెట్ విమానంలో రోజూ తినే రిచ్ ఫుడ్ తింటూ ఫొటోలకు ఫోజిచ్చాడు. ఆ ఫొటోలు కూడా ఇన్ స్టాలోనే పోస్టు చేశాడు. తన ముద్దుల కుమారుడు మొహమ్మద్ అవాల్ ముస్తఫా కోసం ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాయిలియా ముస్తఫా విలాసవంతమైన భవనాన్ని పుట్టినరోజు కానుకుగా కట్టించి ఇచ్చాడు.
ఇప్పుడా ఆ లగ్జరీ హౌస్ ను కూడా ఫొటో తీసి తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు. అంతేకాదు.. జీవితంలో కష్టాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఏది ఎన్ని ఏమి వచ్చినా మనకు ఎప్పుడూ ఒకేలా స్వాగతించేది మాత్రం మన సొంత ఇల్లు అంటూ పోస్టు పెట్టాడు. ఇప్పుడా రిచ్ కిడ్ పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also : Akkineni Nagarjuna : ఆ మాట నేను అనలేదు.. సమంత-నాగచైతన్య విడాకుల వార్తలపై నాగార్జున క్లారిటీ