Radhe Shyam Movie : రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే ప్రభాస్ జంటగా యు.వి.క్రియేషన్స్, టీ. సిరీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
ఇకపోతే ఈ సినిమాపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూ వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.అసలు ప్రభాస్ వెండితెరపై ఇలా ఎలా కనిపిస్తాడు అని ఆశ్చర్యమేస్తుంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం అయితే నేను మాత్రమే కాదు ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్ నటన ఉంది అంటూ ఈయన ప్రభాస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ సినిమా పై తమన్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ బాహుబలి సినిమాకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని ప్రశంశలు అందించారు. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ సోర్స్ కోసం తమన్ పని చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
Read Also : Radhe Shyam Review : ‘రాధేశ్యామ్’ సినిమా రివ్యూ
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.