Vadapav business: వడాపావ్ బిజినెస్ తో వందల కోట్లు సంపాదిస్తున్నాడు..!

Vadapav business: చేసేది వడాపావ్ బిజినెస్ యే. కానీ సంపాదించేది మాత్రం వందల కోట్ల రూపాయలు. ఏంటీ అనుకుంటున్నారా… అవునండి నిజం. ధీరజ్ అనే ఓ వ్యక్తి వడాపావ్ బిజినెస్ చే్సతూ.. కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే 2000 సంవత్సరంలో సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ నుంచి హోటల్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ తర్వాత ఉద్యోగం చేయాలన్న ఆలోచన అతనిలో ఏమాత్రం లేదు. అందువల్ల తాను కూడా వ్యాపార రంగంలోనే అడుగిడాలని నిర్ణయించుకున్నాడు. స్వీట్స్ తయారు చేసి ఎగుమతి చేసే వ్యాపారం ప్రారంభించాడు. ఇంట్లో వారు పెట్టుబడి పెడతామన్నా తానే సొంతంగా లోన్ తీసుకొని వ్యాపారం ప్రారంభించారు.

Advertisement

Advertisement

అయితే తానొకటి ఊహిస్తే మరోటి జరిగింది. వ్యాపారం లాభదాయకంగా సాగలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించలేకపోయారు. చివరకు దాదాపు 50 లక్షల నష్టం చవిచూశారు. ఇక లాభం లేదనుకొని వ్యాపారాన్ని ఆపేశారు. మహారాష్ట్రలో మరీ ముఖ్యంగా ముంబైలో ఎక్కువగా తినే ఆహారం వడాపావ్. ఒక్క ముంబైలోనే 18 నుంచి 20 లక్షల వడాపావ్ లు అమ్ముడుపోతాయట. అయితే ఇంత మంది తినే వడాపావ్ రోడ్డు పక్కన అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు కావడం ధీరజ్ గుప్త దంపతులు గమనించారు.

Advertisement

2001 ఆగస్టు 23వ తేదీన చాట్ ఫ్యాక్టరీ పేరుతో ముంబై నగరంలోని మలాడ్ రైల్వే స్టేషన్ వద్ద వడాపావ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఎక్కువ వడాపావ్ లు అమ్ముడు అవడంతో … దాని మీద దృష్టి సారించారు. రైల్వే స్టేషన్ వెలుపలే జంబోకింగ్ పేరుతో బ్రాండెడ్ ఔట్ లెట్ ప్రారంభించారు. వడాపావ్ చాలా రుచిగా ఉండడంతో కొద్ది కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయారు. లాభాలు ఎక్కువవడంతో.. జంబోకింగ్ ను ఇతర దేశాలకు కూడా విస్తరించారు. ఇలా వందల కోట్లలో లాభాల్ని పొందుతున్నారు.

Advertisement
Advertisement