...
Telugu NewsEntertainmentActress aishwarya: నాటి స్టార్ హీరోయిన్ నేడు సబ్బులు అమ్ముకుంటూ బతుకుతోందా.. పాపం!

Actress aishwarya: నాటి స్టార్ హీరోయిన్ నేడు సబ్బులు అమ్ముకుంటూ బతుకుతోందా.. పాపం!

Actress aishwarya: నాడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేనా దాదాపు 200 సినిమాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంది. అయితే ఇంత మంచి పేరున్న ఈ నటి ప్రస్తుతం వీధుల్లో సబ్బులు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. ఏంటీ నిజమా అనుకుంటున్నారా.. అవునండీ ఇది నిజమే. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక పొట్టకూటి కోసం సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుందట నటి ఐశ్వర్య. అదేనండి ప్రముఖ నటి లక్ష్మీ కుమార్తె.

Advertisement

తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈమె… సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు. యాక్టింగ్ పరంగా వందకు వంద మార్కులు సంపాదించిన ఆమె… ఆర్థికంగా మాత్రం ఏమాత్రం డబ్బులు వెనకేసులేకపోయింది. ప్రస్తుతం తనకు పని లేక డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే వీధుల్లో తిరుగుతూ సబ్బులు అమ్ముకుంటానని స్పష్టం చేసింది. ఉన్న ఒక్క కూతురి పెళ్లి చేసి అత్తారింటికి పంపానని.. ప్రస్తుతం తానొక్కతే ఒంటరిగా ఉంటున్నట్లు వెల్లడించింది.

అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఏ పని చేసేందుకైనా సిద్ధమని ఐశ్వర్యం తెలిపింది. ఎవరైనా వచ్చి మా ఆఫీసులో పని ఉంది చేయండి అన్నా… తప్పకుండా వచ్చి చేస్తానంటోంది. అవసరం అయితే టాయిలెట్స్ కూడా కడుగుతానని వివరిస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు. సినిమాల్లో ఉన్న ఆమె లగ్జరీ లైఫ్ రన్ చేస్తుందనుకుంటే… బతికేందుకు ఇంత కష్టపడడం ఏంటంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు