Road damages: రోడ్లపై నాటేస్తూ యువకుడి వినూత్న నిరసన.. ఎక్కడంటే?

Road damages: వైఎస్సార్ జిల్లాలో ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. తమ గ్రామానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని కోరుతూ.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపాడు. రోడ్లపై నాట్లు వేస్తూ, పొర్లు దండాలు పెడుతూ.. రోడ్డు బాగు చేయించమని కోరుతున్నాడు.

Advertisement

తమ ఊరు 40 ఏళ్లుగా ఉందని… వర్షం పడ్డ ప్రతీసారి రోడ్డుంతా గుంతలు, బురద మయంగా మారి పెద్ద సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. గ్రామ వార్డు సభ్యుడైన రాజేష్ ఇలా వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ గ్రామస్థుడు నెట్టింట పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అయింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ వీడియోని షేర్ చేశారు. ఒక్కసారి ఈ రోడ్డు పరిస్థితి చూడండంటూ పోస్ట్ చేశారు.

అంతే కాకుండా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ క‌ల్లా రోడ్ల‌పై ఒక్క గుంత క‌న‌ప‌డ‌కూడ‌దంటూ మూడేళ్లుగా మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు ప్ర‌తీ ఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్ష‌ర‌మూ మార‌లేదని.. రోడ్ల దుస్థితీ నేటికీ మార‌లేదన్నారు.

Advertisement