...

Guppedantha Manasu: దేవయానికి తగిన విధంగా బుద్ధి చెప్పిన వసు.. రిషికి ధైర్యం చెబుతున్న వసు.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు రిషి ఇద్దరు మహేంద్ర వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరూ జగతి వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు రిషి గతంలో మహేంద్ర ను ను తిట్టిన విషయాలు గుర్తుతెచ్చుకొని నా వల్లే డాడ్ వాళ్లు వెళ్లి ఉంటారా వసు అని అడుగుతూ ఉంటాడు. అయినా అలా వదిలి వెళ్లిపోవడం ఏంటి అంటూ బాధపడుతూ ఉంటారు రిషి.

Advertisement

Advertisement

అప్పుడు వసు బాధపడకండి సార్ మీరు ఎలా అయితే మహేంద్ర సార్ గురించి సార్ కూడా మీ గురించి అంతే బాధపడుతూ ఉంటారు వచ్చేస్తారు మీరు ఏం బాధపడకండి అంటూ ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి వారిద్దరి మాట్లాడుతున్న మాటలు అన్ని చాటుగా వింటూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార చెయ్యి పట్టుకుని మాట్లాడుతూ ఉండగా అది చూసి దేవయాని కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

మరొకవైపు ధరణి ఏదో ఆలోచిస్తూ పాలు పొంగిపోతున్న పట్టించుకోదు. ఇంతలో వసుధర అక్కడికి వచ్చి ఏం జరిగింది మేడం ఏం ఆలోచిస్తున్నారు అని అనగా చిన్న అత్తయ్య మామయ్య వెళ్లిపోయారు నాకు ఏదోలా ఉంది వసు అని బాధపడుతూ ఉంటుంది ధరణి.

Advertisement

అప్పుడు ఏం కాదు మేడం ధైర్యంగా ఉండాలి అని ధరణికి ధైర్యం చెప్పి రిషి కాఫీ తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు వసు కాఫీ కావాలా మేడం అని అడగగా అవసరం లేదు ఇది నా ఇల్లు నారాజ్యం ఏది నచ్చితే అది చేస్తాను అని అంటుంది. థాంక్యూ మేడం అని అనగా థాంక్యూ ఎందుకు అని అడగడంతో మీరు మళ్ళీ కాఫీ కావాలి అని అడిగితే మళ్లీ పెట్టి ఇవ్వాలి కదా అందుకే అని అంటుంది.

Advertisement

దాంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఇంటి నుంచి వెళ్ళిపో అని అనగా వెళ్ళను మేడం రిషి సార్ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార కాఫీ తీసుకొని వెళ్తుంది.

Advertisement

ఆ తర్వాత రిషి కాఫీ తాగుతూ మనం కాలేజీకి వెళ్దాం పద వసు అక్కడికి డాడ్ వాళ్ళు వస్తారేమో అని అంటాడు. మరొకవైపు జగదీదంపతులు గౌతమ్ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు. పక్కనే ఉన్న గౌతమ్ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ సర్ ఈ సమయంలో ఇక్కడికి రావడం గురించి నేను అడగొచ్చు లేదా నాకు తెలియదు అని అడుగుతూ ఉండగా తప్పదు గౌతమ్ మేము ఒక ప్రాబ్లం లో ఉన్నాము ఆ సమస్య తీరే వరకు ఇక్కడే ఉంటామో మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు అని అంటాడు.

Advertisement

గౌతమ్ సరే అని అంటాడు. మరొకవైపు కాలేజీలో వసుధార దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నా వసుధార అనడంతో మేడం వాళ్ళు వెళ్లిపోవడానికి ఒక రకంగా నేనే కారణమేమో సార్ అని అనడంతో రిషి కోప్పడతాడు. అప్పుడు రిషి తో సార్ మనిద్దరి వల్ల ఏమైనా సార్ వాళ్ళు వెళ్లిపోయి ఉంటారా అనడంతో రిషి కోపడుతూ అలా ఎందుకు ఆలోచిస్తున్నా వసుధార అని తిడతాడు.

Advertisement

నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను అడగాలి కానీ ఇలా ఇంటిలో నుంచి వెళ్లిపోవడం ఏంటి అని అంటారు. అప్పుడు ఒకవేళ జగతి మేడం విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే అని వసుధార అంటూ ఉండగా ఆపు వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి.

Advertisement
Advertisement