Guppedantha Manasu serial Oct 25 Today Episode : తెలుగు బుల్లీ తెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి, వసు ఇద్దరూ కాలేజీలో మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో వసుధర వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి మనమే కారణమేమో అనగా అపుడు రిషి నేను అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటాను అని అంటాడు. అప్పుడు వసుధార మళ్లీ మొదటికి రావడంతో రిషి సీరియస్ అవుతాడు. డాడీ కి కోపం ఉంది కాబట్టి వెళ్లిపోయారు కోపం తగ్గిన తర్వాత తిరిగి వస్తారు అని అంటాడు రిషి.
అప్పుడు వసు చిన్న ప్రాబ్లమే వచ్చేలాగా ఉంటే వెళ్లిపోరు కదా సార్ అని అంటుంది. మరి అందర్నీ అని అర్థం చేసుకున్న అన్ని ఎవరు అర్థం చేసుకుంటారు వసు అని అనడంతో నేను ఉన్నాను కదా సార్ అని అంటుంది వసు. ఆ తరువాత వసు, రిషి ఇద్దరు మీటింగ్ హాల్ కి వెళ్లి జగతి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరొకవైపు జగతి వాళ్ళు బాధపడుతూ ఉంటారు.
అప్పుడు గౌతమ్ అంకుల్ వాళ్లు ఎక్కడున్నారు అని చెబితే వీళ్ళు బాధపడతారు చెప్పకపోతే వాడు బాధపడతాడు ఏం చేయాలి దేవుడా అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వసు వాళ్లు జగతి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత గౌతమ్ నీతో కొంచెం మాట్లాడాలి ఒక ప్రదేశానికి రా అని చెప్పి రిషి కి మెసేజ్ చేస్తాడు. మరొకవైపు దేవయాని, జగతి వాళ్ళ గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది.
Guppedantha Manasu అక్టోబర్ 25 ఎపిసోడ్ : మహేంద్ర టెన్షన్ ..గౌతమ్,రిషికి నిజం చెబుతాడ..
ఇంతలో ధరణి అక్కడికి రావడంతో కొద్దిసేపు ధరణి పై విరుచుకుపడుతుంది దేవయాని. మరొకవైపు జగతి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు జగతి వాళ్లు టెన్షన్ పడుతూ ఉండడంతో నేనే రమ్మన్నాను అని అంటాడు గౌతమ్. మరొకవైపు మహేంద్ర,గౌతమ్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడు రిషి ఇంట్లోకి వచ్చి మహేంద్ర కోసం వెతుకుతూ ఉంటాడు.
అప్పుడు రిషి,గౌతమ్ ని ఎంత అడుగుతున్నా చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు రిషి పడే బాధను చూసి మహేంద్ర వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తర్వాత గౌతమ్, రిషి అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు. టేబుల్ మీద మహేంద్ర, రిషి ఫోటో ఉండటం చూసి మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ విషయం గౌతమ్ కి సైగలు చేసి చెబుతాడు.
ఆ తర్వాత గౌతమ్ అక్కడికి వచ్చి ఆ ఫోటోని దాచిపెడతాడు. ఇప్పుడు రిషి గౌతమ్ తో డాడ్ కనిపిస్తే సారీ చెబుతాను చాలా మంచివాడు అంటూ ఎమోషనల్ అవుతూ మాట్లాడగా ఆ మాటలు విన్న జగతి, మహేంద్ర లు కూడా బాధపడుతూ ఉంటారు.
Read Also : Guppedantha Manasu: దేవయానికి తగిన విధంగా బుద్ధి చెప్పిన వసు.. రిషికి ధైర్యం చెబుతున్న వసు.?