Guppedantha Manasu November 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార మాటలకు దేవయాని షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో పసుధార దేవయానితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వసుధార అనడంతో అవును మేడం అని అంటుంది వసుధార. అప్పుడు దేవయానికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది వసుధార. అప్పుడు ఓకే మేడం బాయ్ నేను వెళ్ళొస్తాను నాకోసం రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు అని అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో గౌతమ్,రిషి ఇద్దరు రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు రిషి వాళ్ళ డాడ్ ని తలచుకొని బాధపడుతూ ఉంటారు.

Guppedantha Manasu November 9 Today Episode
ఇంతలోనే ఎక్కడికి వసుధార రావడంతో అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ వసుధార అని అంటాడు. ఇప్పుడు చెప్పకండి సార్ రిజల్ట్స్ వచ్చినాక చూద్దాం. నాకు టెన్షన్ గా ఉంది సార్ భయం వేస్తుంది అని టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది. అప్పుడు రిషి ఏంటి వసుధార నువ్వు ఇంతలా భయపడుతున్నావ్ నువ్వు తప్పకుండా యూనివర్సిటీ టాప్ వస్తావు అంటూ ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి కాలేజీకి వెళ్తారు. కాలేజీలో ఒకచోట కూర్చుని వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు వసుధార వెనుక వైపు నుంచి స్టూడెంట్స్ అందరూ రిజల్ట్ వచ్చాయి అంటూ అక్కడికి పరిగెడుతూ ఉంటారు. అప్పుడు వసుధార టెన్షన్ పడుతూ నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలోనే అక్కడికి పుష్ప వచ్చి ఏంటి వసుధార రిజల్ట్ చూసుకున్నావా అనగా లేదు పుష్ప నువ్వే చూసి నాకు చెప్పు అనడంతో వెంటనే పుష్ప నువ్వే చూసి ఆ గుడ్ న్యూస్ నీ నోటితో చెప్పు వసుధార అని అంటుంది.
లేదు పుష్ప నాకు సరిగా మైండ్ పని చేయడం లేదు కళ్ళు కూడా సరిగా కనిపించవు వెళ్లి చూడు పుష్ప అనడంతో పుష్ప వెళ్లి నెంబర్ సన్నీ చూడగా తాను సెకండ్ ప్లేస్ లో వచ్చాను అని సంతోషపడుతూ నీ నెంబర్ ఎక్కడ కనిపించలేదు అనటంతో వసుధర షాక్ అయ్యి ఏంటి ఇలా జరిగింది కొంపదీసి నేను ఫెయిల్ అయ్యానా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి అక్కడికి రావడంతో స్టూడెంట్స్ అందరూ సంతోష పడుతూ ఉంటారు.
Guppedantha Manasu నవంబర్ 9 ఎపిసోడ్ : వసుధార వీడియో చూసి గౌతమ్, మహేంద్ర, జగతి సంతోషం..
మరొకవైపు గ్రౌండ్లో వసుధార తన నెంబర్ కనిపించడం లేదు అని ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి నువ్వు ఫెయిల్ అవ్వడం ఏంటి వసుధార నువ్వు పాస్ అయ్యావు అని ఋషి అనడంతో వసుధార సార్ మీరు నిజంగానే చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని అంటుంది. మరి నా నెంబర్ నోటీస్ బోర్డు లో లేదు కదా సార్ అనడంతో యూనివర్సిటీ టాపర్ పేరు లిస్టులో అవసరమా అందుకే నేనే ప్రింట్ చేయించ లేదు అనడంతో వెంటనే వసుధార సంతోషపడుతూ నేను సాధించాను సార్ అంటూ గట్టిగా అరుస్తూ రిషి చేతులు పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఉంటుంది.
ఇప్పుడు రిషితో కలిసి గంతులు వేస్తుంది. అప్పుడు రిషి ఈ విషయం డాడ్ వాళ్లకు తెలిస్తే చాలా సంతోషపడతారు వసుధార అని అంటాడు. ఆ తర్వాత గౌతమ్, స్టూడెంట్స్ అందరూ వచ్చి వసుధారకి టాపర్ అని పొగుడుతూ కంగ్రాట్స్ చెబుతూ ఉంటారు. మరొకవైపు దేవయాని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ధరణి అక్కడికి వచ్చి అత్తయ్య వసుధార యూనివర్సిటీ టాపర్ అయ్యింది అనడంతో వెంటనే దేవయాని ధరణిని కోప్పడి అక్కడి నుంచి పంపిస్తుంది.
మరొకవైపు గౌతమ్ జగతి దంపతులకు వసుధార సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో చూపించడంతో జగతి దంపతులు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు చూసావా జగతి ఎంత సంతోషంగా ఉన్నారో అనడంతో మనకు కూడా అదే కదా అంకుల్ కావాల్సింది అని అంటాడు గౌతమ్.