Guppedantha Manasu November 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి మహేంద్ర కోసం వెతుకుతూ ఉంటాడు.
ఈ రోజు ఎపిసోడ్ లో మహేంద్ర కనిపించకపోవడంతో రిషి బాధపడుతూ డాడ్ కి ఎందుకు నా మీద ఇంత కోపం నేను డాడీకి ఏం చేశాను అని బాధపడుతూ ఉండగా అప్పుడు వసుధార బాధపడకండి సార్ మహేంద్ర సార్లు వాళ్లు వస్తారు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లో ఉంటారు వెళ్దాం పదండి సార్ అని అనగా అప్పుడు రిషి నువ్వు ఆ మాటలు నమ్ముతున్నావా వసుధార వాళ్ళు కావాలనే మనల్ని పక్కదారి పట్టించడం కోసం అలా చెప్పారు అని అంటాడు.
మరొకవైపు మహేంద్ర గౌతమ్ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహేంద్ర గౌతమ్ నన్ను రిషి చూసేవాడు కానీ తప్పించుకొని వచ్చాం అనడంతో గౌతమ్ అవునా సరే అంకుల్ అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావ్ గౌతం అంటూ ఫోన్ లాక్ ఉంటుంది. గౌతమ్ భయపడుతూ ఉండదా మీ పెదనాన్నతో ఇక్కడ జరిగే విషయాలు అన్నీ చెబుతున్నావు అంటుంది.
ఇంతలోనే వసుధార, రిషి అక్కడికి వస్తారు. అప్పుడు మహేంద్ర చేసిన విషయం రిషి చెప్పడంతో వెంటనే దేవయాని కొందరి ఇంటికి రావడంతో వారిలో అలాంటి మార్పులు వచ్చి ఉంటాయి అని వసుధార ను ఉద్దేశించి అంటుంది దేవయాని. అప్పుడు వసుధార మనసులో మీ నిజ స్వరూపమే రిషి సార్ కు తెలిసేలా చేయాలి అని అనుకుంటూ. ఆ తర్వాత రిషి మహేంద్ర రూమ్ కి వెళ్లి మహేంద్ర తో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
Guppedantha Manasu నవంబర్ 8 ఎపిసోడ్ : వసుధార మాటలకు దేవయాని షాక్..
ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చినట్టుగా అనిపించడంతో వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటాడు. కానీ తీరా చూస్తే అక్కడ గౌతమ్ ఉండేసరికి రిషి మరింత బాధపడతాడు. అప్పుడు గౌతమ్ రిషి బాధపడకు రిషి వస్తారులే అని అనగా వెంటనే రిషి వాళ్ళు రారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగా,ఏంటి రా అని అడగడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటాడు రిషి. అప్పుడు గౌతమ్ ఎంత చెప్పిన వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోమని అరుస్తాడు రిషి.
మరొకవైపు వసుధార ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి వసుధార చేతులు పట్టుకుని వసుధారకు ధైర్యం చెబుతూ ఉంటాడు. భయపడకు వసుధారా నువ్వు యూనివర్సిటీ టాపర్ గా ర్యాంక్ సాధిస్తావు అని ధైర్యం చెబుతాడు రిషి. ఆ తర్వాత ధరణి ఇద్దరు కిచెన్ లో పనిచేస్తూ ఉండగా అప్పుడు వసుధార ధరణిని పొగుడుతూ ఉంటుంది.
ఇప్పుడు ధరణి దేవయానికి కాఫీ తీసుకుని వెళుతూ ఉండగా నేను ఇస్తాను అని చెప్పి వసుధార తీసుకొని వెళ్తుంది. అప్పుడు వసుధార కాఫీ ఇవ్వడంతో నువ్వు తెచ్చావ్ ఏంటి నా కోడలు ఏమైంది అని దేవయాని అడగగా నేను కూడా మీ కోడలా అంటే దాన్ని కదా మేడం అని వసుధార అనడంతో దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు వసుధార దేవయానికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. దాంతో దేవయాని వసుధార మాటలు విని షాక్ అవుతుంది.
Read Also : Guppedantha Manasu November 7 Today Episode : వసు,రిషి మధ్య రొమాంటిక్ సీన్.. బాధతో కుమిలిపోతున్న రిషి..?