Mahesh Babu : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు సోదరుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న రమేశ్ బాబు శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. రమేష్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. రమేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని తమ ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నారు.
సోదరుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల కరోనా బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య రమేశ్ బాబు ఆఖరి చూపుకు నోచులేకపోయానంటూ మహేశ్ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. రమేశ్ బాబు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రమేశ్ మృతితో మహేశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్న మహేష్‌ను నమ్రత ఓదార్చుతూ ధైర్యం చెబుతున్నారు.
అన్నయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని మహేశ్ బాబు గుర్తు చేసుకుంటూ కన్నీంటిపర్యంతమయ్యారు. సోషల్ మీడియాలో మహేశ్ బాబు ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘మీరే నాకు ఆదర్శం. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుండా ఉంటే.. ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. నాకోసం మీరు ఎంతో చేశారు. ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత