Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నందు లాస్యలు కంపెనీ గురించి సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్, నందు దంపతులు అందరూ కలిసి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడున్న మేనేజర్ ఫోన్ వస్తుంది అని చెప్పి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత తులసికి కూడా ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్తుంది. అక్కడ మేనేజర్ ఎవరితోనో సామ్రాట్ ని మోసం చేయాలి అంటూ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు అన్నీ కూడా విని తులసి షాక్ అవుతుంది.
నీ గురించి నేను సామ్రాట్ గాడికి చెప్తాను అనడంతో చంపేస్తాను అని బెదిరిస్తాడు మేనేజర్. ఆ తర్వాత మేనేజర్ సంతకాలు అయిపోయాయి కదా ఇస్తే నేను వెళ్తాను అని అనడంతో ఇంతలోనే తులసి ఎక్కడికి వచ్చి ఆ ఫైల్ ని గుంజుకుంటుంది.. ఏం జరిగింది తులసి గారు అని అడగగా అతను ఫోన్ కాల్ రికార్డింగ్ ని సామ్రాట్ కి వినిపించడంతో సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలేయకూడదు అని మేనేజర్ పై కోప్పడుతూ ఉండగా అప్పుడు అతడు తులసిని రిక్వెస్ట్ చేసి వదిలేయమని చెబుతాడు. అదంతా చూస్తున్న నందులాస్య లు ఓవరాక్షన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ మన కంపెనీకి కొత్త మేనేజర్ నియమించుకోవాలి అనడంతో నందు,లాస్యలు వారిద్దరిలో ఒకరిని నియమిస్తారు అని సంతోష పడుతూ ఉంటారు.
అప్పుడు కావాలనే లాస్య సామ్రాట్ ని తెగ పొగిడేస్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ నాతో పాటు రండి అనౌన్స్ చేస్తాను అని చెప్పి నందు లాస్యలను తులసి కుటుంబం ముందుకు తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మా కంపెనీకి కొత్త మేనేజర్ గా తులసి గారి నియమిస్తున్నాము అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. కానీ అభి సామ్రాట్ దంపతులు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు.
అప్పుడు కావాలనే అభి మీరు ఏ ఉద్దేశంతో మా అమ్మకు అంత పెద్ద పదవి ఇస్తున్నారు అంటూ కాస్త వంకరగా మాట్లాడుతాడు. కానీ తులసి కుటుంబం అందరూ కూడా తులసికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. ఆ తర్వాత నందు లాస్య వాళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోయి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నందు కోపంతో రగిలిపోతూ ఉండగా లాస్య మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World