Intinti Gruhalakshmi July 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి తన అత్తమామలతో పిల్లల గురించి చెప్పుకొని సంతోషపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి,వసుధారకి బోనం రాకపోయేసరికి తులసి వారి దగ్గరికి వెళ్లి బోనం ఎలా చేయాలి అన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉపవాసంతో బోనం ఎత్తుకున్న వారికి కళ్ళు తిరుగుతున్న సమయంలో పసుపు నీళ్లు ముఖంపై చల్లాలి అని సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లాస్య నందు వాళ్లు గుడి దగ్గరికి వస్తారు.
అప్పుడు నందు లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకో లాస్య అని అనగా అప్పుడు లాస్య నందుతో వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు లాస్య భాగ్యతో తులసి బోనం సమర్పించకుండా చేయడానికి వచ్చాను అని అనగా వెంటనే భాగ్య ఆ పని నేను చూసుకుంటాను అని అంటుంది. అప్పుడు తులసీ తన కుటుంబాన్ని చూసి ఎప్పుడు ఇలాగే ఉండాలి అని దేవుడిని కోరుకుంటుంది. ఇంతలో లాస్య వాళ్ళు అక్కడికి రావడంతో తులసి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య కావాలనే తులసి వారికి ఎదురుగా బోనం తయారు చేస్తూ తులసి కుటుంబాన్ని పెట్టే విధంగా మాట్లాడుతుంది. దాంతో అనసూయ లాస్య కు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత తులసి దివ్యతో మనం కుండలను జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెబుతుంది.
Intinti Gruhalakshmi July 12 Today Episode : తులసి జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడన్న అమ్మవారు..
ఆ మాటలు విన్న లాస్య భాగ్యకు ఒక ప్లాన్ చెప్పి అక్కడికి పంపిస్తుంది. ఆ తర్వాత భాగ్య అక్కడికి వెళ్లి మొత్తానికి తులసి వారికి కుండలు కింద పడేలా చేస్తుంది. ఇంతలోనే అందరూ అక్కడికి వెళ్లి ఏం చెప్పు చేశారు ఇలా జరిగింది అని అనుకుంటూ ఉండగా లాస్య కూడా రెండు మాటలు అంటుంది. ఇంతలో మాధవి అక్కడికి వచ్చి తులసికి కొండలను ఇస్తుంది. అప్పుడు తులసి సంతోష పడుతూ ఉంటుంది.
దాంతో లాస్య భాగ్య ఇద్దరూ వారి ప్లాన్ ఫెయిల్ అయినందుకు నిరాశపడుతూ ఉంటారు. ఆ తర్వాత లాస్య మరొక ప్లాన్ వేసి ఎలా అయిన తులసికి నిద్రమాత్రలు వేయించాలి అని భాగ్యకి చెప్పి పగటి కల కంటుంది. ఆ తర్వాత సాక్షి,వసుధార ఇద్దరు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంతో డ్యాన్సులు చేస్తూ ఉంటారు.
అప్పుడు ఆ రెండు కుటుంబాల డ్రామా మొత్తం వసుధారకు తెలిసిపోతుంది. అప్పుడు లాస్య కావాలని ఇంటి కోడలు బోనం ఎత్తించాలి అని గొడవ చేయడంతో చివరికి న్యాయం పరంగా అతి తులసికి చెందుతుంది. ఆ తర్వాత భాగంలో తులసి అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. అక్కడ అమ్మవారు వచ్చిన ఒక మహిళ తులసికి త్వరలోనే మంచి రోజులు వస్తాయని, తులసి జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడు అని అంటుంది. ఆ విషయం తెలుసుకున్న నందు షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి లో గుప్పెడంత మనసు భామలు.. ఎందుకొచ్చారో తెలుసా?