Krishnam raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. తన నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ అంటే కృష్ణం రాజుకు చాలా ఇష్టం. తన సొంత కుమారుడు కాకపోయినా… చాలా ప్రమేగా చూసుకునే వారు. అంలాగే ఆయనతో కలిసి నటించడానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవారు. అందుకే వీరిద్దరూ కలిసి వెండితెరపై పలు సినిమాల్లో నిపించారు. భిల్లా, రెబల్, రాధేశ్యామ్, సినిమాల్లో వీరిద్దరి కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ప్రభాస్ సినిమాలు, స్టార్ డమ్, ఎదుగుదలను కళ్లారా చూసిన కృష్మంరాజు.. ప్రభాస్ పెళ్లని మాత్రం చూడకుండానే కన్నుమూశారు. ఈరోజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోక సంద్రంలోకి చోశారు. అయితే ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు కోరికట. అయితే అది తీరని కోరికగానే మిగిలిపోయింది.
ప్రభాస్ వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఈయన పెళ్లి గురించి రాధేశ్యాం సినిమాలోనూ డైలాగ్స్ ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం సోలోగా ఉండేందుకే ఇష్టపడుతున్నారి టాలీవుడ్ టాక్. కేవలం ప్రభాస్ తోనే కాకుండా ప్రభాస్ కు పుట్టబోయే పాప, బాబుతోనో కూడా సినిమాల్లో నటించాలని కోరికగా ఉందంటూ చాలా సార్లు తెలిపారు.