Chanakya Neethi : చాణక్యుడి చెప్పి నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు పాటిస్తే జీవితం ఆనందమయంగా మారుతుంది. దాంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. జీవితానికి సరైన మార్గాన్ని చూపుతాయి చాణక్యుడు చూపిన విధానాలు. ఆయన చెప్పిన విధానాలను అనుసరిస్తే క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి పరిస్థితి నుండి బయటపడటానికి ఆ సూత్రాలు, విధానాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. చాణక్య నీతి ప్రకారం ధర్మ ప్రవర్తన లేని వ్యక్తి అందం వ్యర్థం.
జ్ఞానం ఉండీ లక్ష్యాన్ని అందుకోకపోతే దాని వల్ల ఏ ఉపయోగం లేనట్టే. సక్రమంగా వినియోగించుకోలేని ధనం ఎప్పుడు వృథానే. అది ఎప్పుడూ నిరుపయోగంగా పడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇలాంటి అనేక సూత్రాలను అందించాడు. చాణక్యుడి సూత్రాలను అవలంబించడం వల్ల విజయులు కావొచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అందం, జ్ఞానం, సంపద గురించి చాలా వివరించాడు. అలాగే ఏ పరిస్థితుల్లో అవి వ్యర్థమవుతాయో చక్కగా తెలియజెప్పాడు.
చాణక్యుడి వివరణ ప్రకారం శరీర సౌందర్యానికి, వారిలో గుణాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఒకరు అందంగా ఉన్నా.. అతనిలో సద్గుణాలు లేకుంటే అతని అందం వృథాగా పరిగణించబడతుంది. ధర్మ ప్రవర్తన లేని అందం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే ఒక వ్యక్తి దుష్ట స్వభావం కలిగి ఉంటే అతను ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా అతని కుటుంబసభ్యులు సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది
వంశంలోని ఆచారాల ప్రకారం ఆ వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక లక్ష్యంతో జీవిస్తాడు. అందుకోసం విద్యను అభ్యసిస్తాడు. కానీ లక్ష్యాన్ని సాధించలేని విద్య నిరుపయోగం కిందే లెక్క. విద్యకు జ్ఞానం తోడు అయినప్పుడు జీవితానికి సరైన దిశ ఏర్పడుతుంది. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం డబ్బుకు మూడు లక్షణాలున్నాయి. మొదటిది ఆనందం, రెండోది దాతృత్వం, మూడోది విధ్వంసం. అంటే ధనాన్ని ఆనందం కోసం ఉపయోగించాలి.
Read Also : Anchor Suma: సుమ పాన్ ఇండియా యాంకర్ అంటూ తన పై పంచ్ వేసిన కేజిఎఫ్ హీరో!