KGF Chapter 2 Trailer : కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!

KGF 2 Trailer : KGF Chapter 2 Trailer Launch Countdown Begins for April 14 KGF Chapter 2 Release
KGF 2 Trailer : KGF Chapter 2 Trailer Launch Countdown Begins for April 14 KGF Chapter 2 Release

KGF Chapter 2 Trailer : కన్నడ యాక్టర్ యష్.. అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చే సినిమా.. కేజీఎఫ్.. ఈ మూవీ మొదటి పార్ట్ వచ్చిన కొత్తలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. కేజీఎఫ్ మొదటి పార్ట్ చూసిన తర్వాత యష్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

యష్ అభిమానులంతా ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుందా? అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రయల్స్, టీజర్లు అప్ డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ కేజీఎఫ్ 2 నుంచి మరో కొత్త అప్ డేట్ వచ్చేసింది.. KGF 2 Trailer రిలీజ్ కావడంతో యష్ ఫ్యాన్ప్ పండుగ చేసుకుంటున్నారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న యష్.. అదే జోష్ తో రెండో పార్ట్ కేజీఎఫ్ 2లోనూ అదే డైనమిక్ ఎనర్జీతో కనిపించనున్నాడు.

Advertisement

కేజీఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అదే స్థాయిలో తన టేకింగ్‌తో హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. కేజీఎఫ్ 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లకు భారీగా రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ మరో ట్రైలర్ వదిలింది. మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం.. ఇప్పుడీ ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ట్రైలర్ లో యష్ డైలాగ్.. అభిమానుల్లో పునకాలను తెప్పిస్తున్నాయి. ‘రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేము అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ మరింత ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ మూవీని ఏప్రిల్ 14, 2022న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Advertisement

Read Also : RRR Movie: రామ్ చరణ్ ను విలన్ చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు…వీడియో వైరల్!

Advertisement