...

Kaushal comments: ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టడం మూర్థత్వమంటూ కౌశల్ పోస్ట్..!

Kaushal comments: కేంద్రం చేపట్టిన అగ్నిపథ్ పథకంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దేశ్ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయొద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. రైల్లు ధ్వంసంతో పాటు ప్రభుత్వ ఆస్తుల్ని తగులబెడుతున్నారు. సికింద్రాబాద్ లో అగ్నిపథ్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పోలీసులు కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. కోట్లలో ప్రభుత్వ ఆస్తి ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం మూర్థత్వం అంటూ బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు కౌశల్ మండ ఫైర్ అయ్యాడు.

అప్పుడెప్పుడో బిగ్ బాస్ టైటిల్ గెలిచి వార్తల్లో నిలిచిన కౌశల్ స్వయం ప్రకటిత పోస్టులతో సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనం ఇస్తున్నాడు. తాజాగా అగ్నిపథ్ అంశం హాట్ టాపిక్ కావడంతో దానిపై స్పందించాడు. ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం సరికాదంటూ మండిపడ్డాడు. శాంతి యుతంగా నిరసనలు చేయాలి కానీ… ప్రజా ధనాన్ని ఇలా నాశనం చేయకూడదంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. చాలా మంది తిడ్తుంటే.. మరికొంత మంది కౌశల్ కు అండగా నిలుస్తున్నారు.