Karthika Deepam August 2 Episode : బుల్లితెరపై కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇప్పటికీ అత్యధిక రేటింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న ఈ సీరియల్ రోజురోజుకు ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? శౌర్య,నిరుపమ్ గది నుంచి బయటకు వస్తారా అనే విషయానికి వస్తే..
ప్రేమ్, హిమను చూసి రౌడీలు పరుగులు పెట్టగా వారిద్దరూ ఆ గది వద్దకు వచ్చి చూడగా అప్పటికే నిరుపమ్ లోపల నుంచి తలుపులు తీయడానికి ప్రయత్నం చేస్తారు. బయట గడియ పెట్టడంతో తలుపులు తెరుచుకోవు.అంతలోగా ప్రేమ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా జ్వాలను ఎవరో కిడ్నాప్ చేశారు అని చెబుతాడు. ఒక్కసారిగా నిరుపమ్ మాటలు విన్న ప్రేమ్ హిమా షాక్ అయ్యారు. లోపలి నుంచి నిరుపమ్ తలుపు తీయమని చెప్పగా ప్రేమ్ ఉద్దేశపూర్వకంగానే బయట తాళం వేసి ఉంది అంటూ అబద్ధం చెబుతాడు. ప్రేమ్ మాటలకు ఆశ్చర్యపోయిన హిమ ఎందుకు అబద్దం చెప్పావు అని అడగగా ఇలా అబద్ధం చెబితే వారిద్దరూ లోపలే ఏకాంతంగా ఉండి వారి మధ్య స్నేహం చిగురిస్తుందని చెబుతాడు.
మరోవైపు సౌందర్య ఆనంద్ రావు పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతుండగా వెంటనే హిమ ఫోన్ చేసి మాకు ఏం కాలేదు అందరం క్షేమంగా ఉన్నాము,అయితే ఇప్పుడు ఇంటికి రాలేని పరిస్థితిలో ఉన్నాము రేపు ఉదయమే వస్తామని చెప్పడంతో సౌందర్య ఆనందరావు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే నిరుపమ్, జ్వాలా కోసం ఏదైనా తినడానికి తీసుకురావడానికి ప్రేమ్ హిమ బయటకు వెళ్తారు. మరోవైపు శోభ తన కిడ్నాప్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిందని అప్సెట్ అవుతుంది. ఇక నిరుపమ్ సౌర్యను అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు అని ప్రశ్నించగా వాళ్ళు దొంగతనం చేస్తే పోలీసులకు పట్టించానని జ్వాల సమాధానం చెబుతుంది.
Karthika Deepam August 2 Episode : కార్తీక దీపం సీరియల్ ఆగస్ట్ 2 ఎపిసోడ్: ఒకే ప్లేట్ లో శౌర్య, నిరుపమ్ భోజనం
హిమా ప్రేమ్ బయటకు వెళ్లి తినడానికి తీసుకురాగా ఈలోపు శౌర్య నిరుపమ్ మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అంతలోగా ప్రేమ్ హిమ ఫుడ్ తీసుకువచ్చి కేవలం ఒక ప్లేటే దొరికిందని వారిద్దరికీ కలిపి ఒక ప్లేట్ ఇస్తారు. ఇలా ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తారని ప్రేమ్ ప్లాన్ చేశాడు. కేవలం రెండు మాత్రమే దొరికాయి ఒకటి మీకు, ఒకటి మాకి అంటూ భోజనం లోపలికి ఇవ్వగా సౌర్య మాత్రం నిరుపమ్ కు భోజనం పెట్టకుండా తనే తింటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తికాగా తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Karthika Deepam july 27 Today Episode : నిరుపమ్ కాఫీ ఇచ్చిన సౌర్య.. కోపంతో రగిలిపోతున్న స్వప్న..?