Karthika Deepam November 10 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దుర్గ మోనిత ని అడ్డంగా ఇరికిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్,దీప కోసం వెళ్లగా దీప తాళం వేసి ఉండడంతో ఇంత పొద్దున్నే దీప ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియకుండా సౌర్య ని వెతకడానికి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు గుడిలో దీప కసువుడుస్తూ గుడిని శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి పంతులుగారు వచ్చి అమ్మ నువ్వు ఇలాగే ప్రతిరోజు గుడిని శుభ్రం చెయ్యి నువ్వు కోరుకున్న ఆ కోరికలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని చెబుతాడు. దీప ని ఫాలో అవుతూ వచ్చిన మోనిత ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్తుందా అని వెంటపడితే ఈ వంటలక్క గుడిని శుభ్రం చేస్తే అంతా మంచి జరిగిపోతుందా అని అనుకుంటూ ఉంటుంది.
ఏదో పెద్ద కష్టం వచ్చినట్టు గుడి ఊడిచి మెట్లు కడిగి ఎందుకు ఇంత కష్టపడుతుందో అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత దీప అక్కడ నుంచి వెళ్లిపోగా దీప ని మాట్లాడించిన పూజారి దగ్గరికి వెళుతుంది మోనిత. అప్పుడు పంతులుగారు ఆవిడ పొద్దున్నే వచ్చి గుడి మొత్తం శుభ్రం చేసి ఇంత కష్టపడుతోంది కదా ఆమెకు ఏం కష్టం వచ్చింది అని అనడంతో వెంటనే పూజారి నీ కష్టం వస్తే నువ్వు దేవుడికి చెప్పుకోమ్మా అంతేకానీ పక్క వాళ్ళ కష్టాల గురించి తెలుసుకోవాలి అనుకోవడం తప్పు అని అనడంతో మోనిత మౌనంగా ఉంటుంది.
అంటే ఆమె అంత కష్టపడుతుంది కదా ఏం కష్టం వచ్చిందా అని మోనిత అనడంతో నువ్వు ఆమె కష్టం తెలుసుకొని తీరుస్తావా అని అనగా నేనెందుకు తీరుస్తాను అంటుంది మోనిత. మరి అలాంటప్పుడు తెలుసుకోవాలి అనుకోకూడదు అని మోనిత తగిన విధంగా బుద్ధి చెబుతాడు పూజారి. అప్పుడు మోనిత నేను కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేను కూడా అది కార్తీక్ కోసం దీపాలు వెలిగిస్తాను అని అంటుంది. మరొకవైపు కార్తీక్,దీప ఎక్కడికి వెళ్ళింది ఒక మాట కూడా చెప్పకుండా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు బాబు ఏడవడంతో ఈ మోనిత ఎక్కడికి వెళ్లిందో బాబు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ పనిచేసే ఆమె వచ్చి సర్ మేడం లేదు బయటికి వెళ్లింది అనడంతో సరే వెళ్లి బాబుని ఎత్తుకో అని చెబుతాడు. ఇంతలోనే మోనిత పూజ సామాగ్రి తీసుకొని ఎక్కడికి రావడంతో బాబును వదిలి ఎక్కడికి వెళ్లావు అనిత అని అనడంతో అదేంటి కార్తీక్ బాబుని ఎక్కడో అడవిలో వదిలేసి వెళ్లిపోయినట్టు అలా మాట్లాడుతున్నావ్ నువ్వు ఉన్నావు కదా అని అంటుంది.
Karthika Deepam నవంబర్ 10 ఎపిసోడ్ : దుర్గా మాటలకు మోనిత కార్తీక్ షాక్…
అప్పుడు కార్తీక్ వంటలక్కని చూసావా అనడంతో అప్పుడు గుడిలో దీప పడుతున్న కష్టం గురించి కార్తీక్ కి చెబుతుంది మోనిత. అప్పుడు మోనిత గుడిలో అలా శుభ్రం చేస్తే పూజారి పెట్టే ప్రసాదం తినొచ్చు అలాగే గుడికి వచ్చే భక్తులు చిల్లర వేస్తే ఎలాగో అలా బతికేయొచ్చు అని అనడంతో కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఆడక తినే బతుకు వచ్చింది కార్తీక్ అని మోనిత నవ్వుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు చంద్రమ్మ దంపతులు డబ్బులు ఎంచుతూ ఉండగా ఇంతలో అక్కడికి సౌర్య వస్తుంది.
అప్పుడు సంగారెడ్డి వెళ్దాం పద బాబాయ్ అనడంతో లేదమ్మా ఆటో అమ్మేశాను అని అనగా ఎందుకు అమ్మేసావు బాబాయ్ అనడంతో అప్పుడు చంద్రమ్మ శౌర్యకి అబద్ధాలు చెబుతుంది. అప్పుడు శౌర్య వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాట్లాడడంతో ఇంద్రమ్మ దంపతులు మాట దాటేస్తూ ఉండగా అప్పుడు సౌర్య ఎందుకు బాబాయ్ పిన్ని ఇలా మాట్లాడుతున్నారు. అమ్మనాన్న ల గురించి మాట్లాడుతుంటే మాట దాటేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దీప ఇంటికి రావడంతో ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు.
అప్పుడు కార్తీక్ దీప మోనిత చెప్పేది నిజమేనా అనడంతో అవును డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు ఈరోజు కార్తీక పౌర్ణమి గుడిలో దీపాలు వెలిగించాలి అందుకోసం నాకు ఒక 600 రూపాయలు కావాలి అని మొహమాటంగా అడుగుతుంది దీప. అప్పుడు కార్తీక్ గతంలో దీప అన్నమాట తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఇంకెప్పుడు నువ్వు డబ్బుల కోసం ఇబ్బందికి పడకూడదు అని కార్తీక్ డబ్బులు ఇస్తూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి ఆ డబ్బులు లాక్కుంటుంది.
బంగారం తాకట్టు పెట్టి ఈ వంటలక్క కు తగిలేయడం కోసమేనా అని మోనిత గట్టిగా అరుస్తుంది. వంటలక్క కోసం నాతోనే అబద్ధాలు ఆడుతున్నావా అంత దూరం వెళ్లిపోయిందా మీ మధ్య సంబంధం అంటూ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత కోపం పెరుగుతుంది ఇంకొక మాట మాట్లాడితే చెంప దెబ్బ కొట్టాడు అంటే కన్ఫామ్ గా కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చినట్లే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మోనిత కావాలనే దీప గురించి తప్పుగా మాట్లాడుతుంది. వంటలక్క అడుక్కుంటే నీకేంటి ఏమైపోతే నీకేంటి అనడంతో మోనిత చెంప చెల్లుమనిపిస్తాడు కార్తీక్. అప్పుడు మోనిత నో డౌట్ కచ్చితంగా కార్తిక్ కి గతం గుర్తుకు వచ్చింది అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు కార్తీక్ ఆ విషయాన్ని కవర్ చేసుకోవడం కోసం నువ్వు నీ భర్త కోసం నువ్వు దీపాలు వెలిగిస్తున్నావు అలాగే దీప కూడా తన భర్త కోసం దీపాలు వెలిగిస్తుంది కదా అని కవర్ చేసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గా వస్తాడు. అప్పుడు మోనిత మళ్లీ ఎందుకు వచ్చావురా నా ప్రాణాలు తీయడానికి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దుర్గా మోనిత నా షూ ఎలా ఉన్నాయి అనడంతో నీ షూ ఎలా ఉంటే నాకెందుకురా అని అనగా అదేంటి మోనిత నువ్వే కదా షూ కొనుక్కోమని చెప్పి పదివేలు ఇచ్చావు అనడంతో మోనిత కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు.
అప్పుడు ఇదేంటి మోనిత నువ్వు దుర్గా గారికి షో కొనుక్కోవడం కోసం పది వేలు ఇవ్వచ్చు నేను దీపకి పూజ కోసం డబ్బులు ఇవ్వడం తప్ప నువ్వే ఆ డబ్బులు ఇవ్వు అని అనడంతో అప్పుడు మోనిత కోపంగా దీపకి ఆ డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.