KA Paul: తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని… తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతానని… ఏపీకి ఒక మహిళను ముఖఅయమంత్రిని చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సీఎం కేసఆర్ గురించి వ్యాఖ్యానిస్తూ కేసీఆర్ ఖబడ్దార్.. నేను బటన్ నొక్కితే జైలుకు పోతావంటూ హెచ్చరించారు. తాను అధికారంలకి వచ్చాక రేప్ చేసే వారి సంగతి తెలుస్తానని కేఏ పాల్ చెప్పారు.
సీమ నుంచి ఎన్నికైన సీఎంలు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని రాయలసీమ రాక్షస సీమగా మార్చానని కేఏ పాల్ ఆంధ్ర ప్రదేశ్ గురించి అన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా సీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు ఇక ప్రజలు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని శ్రీలంక, సుడాన్, నైజీరియా, జింబాబ్వే దేశాలుగా చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. స్మార్ట్ సిటీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఏమయ్యాయని బీజేపీ నాయకులను కేఏ పాల్ ప్రశ్నించారు.