Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, జ్వాలాతో మాట్లాడుతూ మనం అక్కాచెల్లెళ్లమేమో అని అనగా హిమ పై కోప్పడుతుంది జ్వాలా.
ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా, నిరుపమ్ కీ మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అని ఐ లవ్ యు చెబుతుంది. దాంతో నిరుపమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు నా గురించి ఏమి అనుకుంటున్నావు అని అడుగుతాడు. వెంటనే నిరుపమ్ ఇంత లేటుగానా చెప్పడం అంటూ ఒక చిరునవ్వు చిందింస్తాడు.
అయితే ఇదంతా కూడా జ్వాల జరిగినట్టు కల కంటుంది.ఇక కల నుంచి బయటకు వచ్చిన జ్వాలా డాక్టర్ సాబ్ పేరు చెప్తూనే నా మనసు గాలిలో తేలిపోతుంది అని హిమ తో అంటుంది. ఇక మరొకవైపు నిరుపమ్, నేను జ్వాలాని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చిరాకు పడుతూ ఉంటాడు. మరొకవైపు హిమ,నిరుపమ్,జ్వాలా లను ఒకచోట కలపాలి అని అనుకుంటూ ఉంటుంది.
జ్వాలా కూడా తన మనసులోని మాటను డాక్టర్ సాబ్ కి చెప్పబోతున్నాను అని ఆనంద పడుతూ ఉంటుంది. మరోవైపు ఆనందరావు, సౌందర్య లు కూర్చొని సౌర్య గురించి బాధపడుతూ ఉంటారు. మరొకవైపు జ్వాలా అందంగా చీర కట్టుకొని హిమ చెప్పిన ప్రదేశానికి వస్తుంది.
అప్పుడు హిమ జ్వాలా కీ బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకోసం జ్వాలా నడిచే దారిలో పువ్వులతో ఏడు అడుగులు అంటూ అలంకరిస్తుంది. అక్కడికి జ్వాలా ఎంతో ఆనందంగా వస్తుంది. కానీ నిరుపమ్ కీ అది ఇష్టం లేకపోవడంతో ఏదోలా ఉంటాడు. ఆ తరువాత హిమ మీ మధ్య మూడో మనిషి గా ఉన్న నేను త్వరలోనే వెళ్ళిపోతాను అని అంటుంది.
అప్పడు నిరుపమ్,జ్వాలా ని చూసి రా జ్వాలా నా మనసులో హిమ ఉంది. నేను హిమని పెళ్లి చేసుకోబోయేది అని నీకు స్పష్టంగా చెప్పేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే జ్వాల ఏడో అడుగు వేస్తూ ఉండగా ఇంతలో ఫోన్ రావడంతో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత హిమ,జ్వాలా దగ్గరికి వెళ్లి ఏంటి జ్వాలా ఇలా చేశావు కరెక్టేనా అని అడగగా.. నా శత్రువు హిమ నాకు ఫోన్ చేసింది అని అనడంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World