Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అభి, తులసి ఇంటికి వచ్చి తులసిని నాన్న రకాల మాటలు అని బాధ పెట్టి వెళ్ళిపోతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ మళ్లీ ఆలోచనలో పడతాడు. డబ్బు విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. తులసి ని డబ్బు అడుగుదామంటే తన దగ్గర డబ్బులు లేదని, ఇక అభిని అడిగిన లాభంలేదని ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
ఆ తర్వాత శృతి, ప్రేమ్ కీ ఫోన్ చేసి వెళ్లిన పని ఏమైంది అని అడగగా అప్పుడు ప్రేమ్ షూరిటీ కావాలి అన్నారు అందుకే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అడుగుతాను అని అనడంతో శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ్ అక్కడికి వస్తే తన బండారం మొత్తం బయట పడుతుంది అని టెన్షన్ పడుతుంది.
మరొకవైపు అంకిత తులసి కోసం ఎదురు చూస్తూ ఉండగా తులసి రావడంతో మీరు మంచి కోసం ఇలా చేస్తున్నారు అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఆస్తి విషయంలో తులసికీ అంకిత థాంక్స్ చెబుతుంది. అప్పుడు తులసి తన కొడుకుతో అనరాని మాటలు అన్నీ అనిపించుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది.
అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్లి తాను రాసిన పాటను ఇస్తాడు. ప్రేమ ని చూసిన శృతి వెంటనే పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఆ తర్వాత ఆ ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాక ఆ ఇంటి ఓనర్ శృతిని ఇంట్లో ఉన్న చెత్తను బయటపడే అని చెబుతాడు.
శృతి చెత్త వేయడానికి బయటికి రాగా అక్కడి నుంచి వస్తున్న అంకిత, తులసి చూసి షాక్ అవుతారు. దాంతో తాను పనిమనిషిగా చేరింది అని బాధ పడతారు. ఇక ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకుంటారు. తులసి మాత్రం బాగా బాధ పడుతూ కనిపిస్తుంది. బాధ్యత పేరుతో కొడుకు, కోడల్ని బయటికి పంపించి ఇలా బాధ పెడుతున్నాను అని అంటుంది.
అప్పుడు తులసీ శృతిని ప్రశ్నిస్తూ నువ్వు చేస్తున్న పని కరెక్టేనా అని అడగగా తప్పని పరిస్థితులలో ఈ పని చేయాల్సి వచ్చింది అని అనగా వెంటనే తులసి నాకు ఒక మాట చెప్పాల్సింది కదమ్మా అని అంటుంది. వెంటనే శృతి మాకు చెప్పే అవకాశం ఇవ్వలేదు అని అనడంతో వారు ముగ్గురు బాధపడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో తులసి బొమ్మలకు వైపు చూసుకుంటూ తన బాధలు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World