...

Junior ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్.. గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నారట పాపం!

Junior ntr : ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నటనకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. నటనలో జూనియర్ ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ అంశ వచ్చిందనే అంటారు. కేవలం నటన మాత్రమే కాకుండా డ్యాన్సుల్లోనూ తన మార్కు చూపిస్తాడు ఎన్టీఆర్. టాలీవుడ్ లో మంచి గ్రేజ్ ఉన్న డ్యాన్స్ చేసే అతి కొద్ది మంది నటుల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన వేసే స్టెప్పులు క్రేజీగా ఉంటాయి.

jr ntr phone number goes viral while talks with fan mother
jr ntr phone number goes viral while talks with fan mother

అయితే తాజాగా ఎన్టీఆర్ కు చెందిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఫోన్ నంబర్ అంటూ నెట్టింట్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇక అభిమానులకు తమ హీరో దొరికితే ఊరుకుంటారా.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ ఫోన్ నంబరుకు వందలు, వేలు, లక్షలకొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఓ ఫ్యాన్ ఆరోగ్య పరిస్తితి ఏమీ బాగా లేకపోతే.. ఆయన కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ఫోన్ చేసిన ఎన్టీఆర్.. వారి యోగ క్షేమాలు తెలుసుకున్నాడు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో కనిపించిన ఫోన్ నంబరును ఎన్టీఆర్ దే అనుకోని పొరబడ్డారు. అభిమానులు మాత్రం ఆగకుండా కాల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, బుచ్చి బాబు సానాలతో సినిమాలను ఎన్టీఆర్ క్యూలో పెట్టేశాడు.


Read Also : Junior ntr: ఎన్టీఆర్ కు డైరెక్టర్ అట్లీ స్పెషల్ ట్రీట్.. చెన్నై నుంచి బిర్యానీ!