...

Used cooking oil: వంటనూనె రెండో సారి వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Used cooking oil: సాధారణంగా మనం ఇళ్లలో పకోడిలు, మిర్చీలు, లేదా ఏవైనా చిప్స్ వంటివి డీ ఫ్రై చేస్తుంటాం. ఆ తర్వాత ఆ నూనెను రెండో సారి కూడా వాడుతుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చెప్తుంటారు. అయినా సరే కొంత మంది అదే నూనెను పదే పదే వాడుతుంటారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకసారి వాడిన నూనెను రెండో సారి వాడటం వల్ల గుండె, లివర్, క్యాన్సర్ జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను అలా రెండు రెండు సార్లు వాడకూడదని చెబుతున్నారు. అయితే ఒకసారి వాడిన నూనెను పాడేయ్యాల అనుకుంటున్నారా.. అలా ఏం అవసరం లేదండి ఒకసారి వాడిని నూనెను ఆ సంస్థకు అమ్మేస్తే సరిపోతుంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదాం పొందిన ఎన్ఎస్ఆర్ సంస్థ ఒకసారి వాడిని నూనెను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే విశాఖలోని పలు రెస్టారెంట్ల, అపార్ట్ మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో వాడిన వంట నూనె కోసం ప్రత్యేక డ్రమ్ములు ఏర్పాటు చేశారు. వాడిన నూనెకు లీటరు కు 30 రూపాయలు చెల్లిస్తారు. అయితే తీస్కెళ్లిన నూనె నుంచి బయో డీజిల్ తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.