Janaki Kalaganaledu serial September 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జానకి పదేపదే అఖిల్ అన్న మాటలు తలుచుకుని చదువు మీద శ్రద్ధ వహించలేకపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో మల్లిక ఆనందంతో చేసిన వంటలు అన్నీ కూడా ముందు పెట్టుకుని ఒక్కటే తింటూ ఆనంద పడుతూ ఉంటుంది. మొత్తం తన ముందు ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఖాళీ చేస్తుంది. ఇంతలోనే విష్ణు అక్కడికి వచ్చి ఇంట్లో అందరూ బాధగా ఉంటే నీకు తిండి ఎలా పడుతుంది అని మల్లిక పై అరుస్తాడు. అప్పుడు మల్లిక కడుపులో బిడ్డ అడిగింది అని అబద్ధం చెప్పి విష్ణుతో గోరుముద్దలు పెట్టించుకుని తింటూ ఉంటుంది.
మరొకవైపు దొంగతనంగా బయటకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు ఎలా అయినా రామచంద్ర నిద్ర లేచే లోపు వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. రామచంద్ర ఎదురుపడడంతో అఖిల్ షాక్ అవుతాడు. అప్పుడు అఖిల్ ని బలవంతంగా తీసుకొని వెళ్తాడు రామచంద్ర. నిజం చెప్పు నిఖిల్ అని రామచంద్ర అడుగుతాడు. అప్పుడు అఖిల్ వస్తే బాగుంటుంది అని గుమ్మం వైపు పదేపదే చూస్తూ ఉంటాడు.
రామచంద్ర మాటలు అఖిల్ వినకుండా దిక్కులు చూస్తూ ఉంటాడు. రామచంద్ర ఎంత మంచిగా మాటలు చెప్పినా కూడా అఖిల్ వినిపించుకోకుండా గెట్టిగట్టిగా మాట్లాడతాడు. అప్పుడు రామచంద్ర అఖిల్ పై కోప్పడతాడు. నీ మాటల్లో నాకు నిజం కనిపించకపోయినా జెస్సీ మాటల్లో నాకు నిజం కనిపించింది అని అంటాడు రామచంద్ర.
కానీ అఖిల్ మాత్రం రామచంద్ర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కావాలనే అఖిల్ ఇంట్లో అందరికీ వినిపించే విధంగా గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర కొట్టడానికి చేయి లేపడంతో ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వచ్చి రామచంద్ర అని గట్టిగా అరిస్తుంది. ఇప్పుడు అఖిల్ జ్ఞానాంబ ముందు దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు.
Janaki Kalaganaledu serial Sep 14 Today Episode : జెస్సి ఏ నిర్ణయం తీసుకోబోతోంది..
అప్పుడు జ్ఞానాంబ అఖిల్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అప్పుడు జానకి తప్పు చేసిన వాడు నలుగురు తిరగడానికి భయపడతాడు. తప్పు చేసిన వాడు నేల చూపులు చూస్తాడు అని అనడంతో అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. గోవిందరాజులు కూడా జానకి రామచంద్రులకు సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి తరఫునుంచి ఒకసారి ఆలోచించి జ్ఞానాంబ అని చెబుతాడు. అప్పుడు మల్లిక కూడా అఖిల్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది.
అప్పుడు వెంటనే విష్ణు,మల్లికపై సీరియస్ అవుతాడు. అప్పుడు విష్ణు కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా అఖిల్ మాత్రం దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు. అప్పుడు అఖిల్ మాటలు నిజం అని నమ్మిన జ్ఞానాంబ, జానకి పై సీరియస్ అవుతుంది. నువ్వు చెప్పినట్టుగా నిజం నువ్వు నిరూపించాలి లేదంటే అమ్మాయి పేరు ఏంటో వినిపించకూడదు అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత మల్లిక జరిగిన విషయాలను తలుచుకొని సంతోష పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత జ్ఞానాంబ పూజ చేస్తూ ఉండగా మల్లిక లీలావతి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు లీలావతి లేనిపోని మాటలు అన్నీ చెప్పి జ్ఞానాంబ ను మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. వెంటనే జ్ఞానాంబ లీలావతి పై మండిపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోమని గట్టిగా అరుస్తుంది.