Janaki Kalaganaledu Sep 13 Today Episode : రామచంద్ర నుంచి తప్పించుకు తిరుగుతున్న అఖిల్.. జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతున్న జానకి..?

Janaki Kalaganaledu Sep 13 Today Episode janaki-gets-upset-as-akhil-misleads-jnanamba-in-todays-janaki-kalaganaledu-serial-episode
Janaki Kalaganaledu Sep 13 Today Episode janaki-gets-upset-as-akhil-misleads-jnanamba-in-todays-janaki-kalaganaledu-serial-episode

Janaki Kalaganaledu September 13 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జానకి చెప్పేవి అని అబద్ధాలు అంటూ అఖిల్ తన తప్పుని కప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో జానకి నిజం నిరూపించడానికి నాకు ఒక నాలుగు రోజులు సమయం ఇవ్వండి అత్తయ్య గారు. ఆ నాలుగు రోజులు జెస్సి ని మన ఇంట్లోనే ఉంచండి అని అనగా అందుకు జ్ఞానాంబ ఒప్పుకోదు. నువ్వు చెప్పినట్టుగానే నీకు నాలుగు రోజులు సమయం ఇస్తున్నాను నువ్వు చెప్పేది నిజమైతే నేనే వీరిద్దరి పెళ్లి చేస్తాను కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది.

Janaki Kalaganaledu Sep 13 Today Episode  janaki-gets-upset-as-akhil-misleads-jnanamba-in-todays-janaki-kalaganaledu-serial-episode
Janaki Kalaganaledu Sep 13 Today Episode janaki-gets-upset-as-akhil-misleads-jnanamba-in-todays-janaki-kalaganaledu-serial-episode

ఇంతలోనే రామచంద్ర జానకి దగ్గరికి వచ్చి మీరు బాధపడొద్దు జానకి గారు నేను మీకు తోడుగా ఉంటాను. పెట్టడానికి జెస్సిని వాళ్ళ ఇంటికి పంపిద్దాము తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పిద్దాము అని జెస్సీని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు రామచంద్ర జానకి. ఆ తర్వాత ముగ్గురు కలిసి జెస్సి ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వారి ముగ్గురిని చూసిన జెస్సీ తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కదా మీ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

జెస్సి రా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాము అని అనగా అంతలోనే రామచంద్ర వద్దు మేము చెప్పేది వినండి అంటూ వారిని కన్విన్స్ చేస్తారు. అప్పుడు రామచంద్ర మాటలకు వారు సరే ఒప్పుకుంటారు. అయింది పెద్ద కొడుకుగా నేను మీకు మాట ఇస్తున్నాను అని అంటాడు రామచంద్ర. ఆ తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడు జానకి రామచంద్ర గారు మీరు నన్ను ఎందుకు ఇంతగా నమ్ముతున్నారు అని అడుగుతుంది.

Janaki Kalaganaledu Sep 13 Today Episode : జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతున్న జానకి..?

ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే మీరు ధైర్యంగా ఉన్నారు కదా జానకి గారు ఈ మాటల్లో నాకు నమ్మకం కనిపిస్తోంది అని అంటాడు. ఈ విషయాలలో పడి మీరు చదువుని మర్చిపోవద్దండి అమ్మ చెప్పినట్టు చదువు మీద కూడా దృష్టి పెట్టండి అని అంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జానకి గదిలో చదువుతూ ఉండగా అఖిల్ మాట మార్చిన విషయాన్ని పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

Advertisement

ఇక మల్లికా తన రూమ్ లో గెంతులు వేసుకుంటూ ఉండగా రామచంద్ర అక్కడికి వచ్చి జానకి తినని భోజనాన్ని అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. అది జ్ఞానాంబ గమనిస్తుంది. ఇంతలోనే అఖిల్ ఫోన్ చూస్తూ బయటకు వస్తాడు. అప్పుడు అఖిల్ ని చూసిన రామచంద్ర ఈ సమస్యలన్నీ తీరాలంటే అఖిల్ నోట్లో నుంచి నిజం బయటికి తెప్పించడమే మంచిది అనుకోని అఖిల్ ని ఆపుతాడు. అప్పుడు అఖిల్ ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు నటించి జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి జ్ఞానాంబ ఒళ్ళో పడుకుంటాడు.

Read Also : Nuvvu Nenu Prema Serial 13 Sep Today Episode : కనిపించకుండా పోయిన అరవింద.. పద్మావతి కోసం ఇంటికి వెళ్లిన విక్కీ.. మురళీ టెన్షన్..!

Advertisement